అదిలాబాద్

ప్రాణహిత కోసం తెలంగాణ తరహా ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాగజ్‌నగర్, జూలై 21: ప్రాణహిత కోసం తెలంగాణ తరహా మరో ఉద్యమం చేయనున్నట్టు అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. కమీషన్ల కోసమే ప్రాణహితను కాళ్లేశ్వరానికి తరలించారని ఆరోపించారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నైనాల గోవర్ధన్ మాట్లాడుతూ 2008లో వైఎస్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 9వేల కోట్లు ఖర్చు చేయగా 1700 కోట్లు ఉమ్మడి జిల్లాల్లో ఖర్చు అయ్యాయని, ఇప్పుడు ఆ డబ్బులు వృధా కానున్నాయన్నారు. ప్రాణహిత నిర్మించి ఉంటే 30వేల కోట్లతో పూర్తి అయ్యి ఉండేందని కాళ్లేశ్వరానికి తరలించడంతో ఇప్పటికే 90వేల కోట్లు ఖర్చు అయ్యిందని, ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 2 లక్షల కోట్లు కావాలన్నారు. ప్రాణహిత నుండి ఎల్లంపల్లి వరకు గ్రావీటి ద్వారా వీటిని తరలించే అవకాశం ఉండేందని ఇందుకు కేవలం 5వేల కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయన్నారు. కాళ్లేశ్వరం పేరుతో డబ్బులు సంపాదించడానికి తమ స్వంత జిల్లాకు నీళ్లు తీసుకెళ్లడానికే ముఖ్యమంత్రి, మంత్రి హరీష్‌రావులు ప్రాణహితను తరలించారని విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 8నెలల పాటు ప్రాణహిత పై చర్చించి మహారాష్ట్ర ప్రభుత్వంతో 148 మీటర్లఎత్తు అనకట్ట నిర్మాణానికి ఒప్పం దం కుదుర్చుకోని జాతీయ హోదా వచ్చే సమయంలో ఒక నాయకుడి ఇంట్లో జరిగిన కుట్రలో ప్రాణహిత ప్రాజెక్ట్‌ను ఒకేసారి కాళ్లేశ్వరానికి తరలించేందుకు నిర్ణయించారని విమర్శించారు. ప్రాణహిత వద్ద నీటి లభ్యత ఏడాదికి 1148 టిఎంసిల సరాసరి ఉంటుందని, ప్రాణహితను కాదనడం తో ఉమ్మడిజిల్లాలోని లక్షల ఎకరాల భూములు బీడు భూములుగామారే పరిస్థితులునెలకొన్నాయన్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సిడం గణపతి మాట్లాడుతూ వైఎస్ సిఎంగా అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్ట్‌గా నామకరణం చేస్తే కేసిఆర్ అంబేద్కర్ పేరును తొలగించిన, దళితుల ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం శోఛనీయమన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి ఆనంద్ మాట్లాడుతూ మన నీళ్లు మన ఉద్యోగాలు అనే లక్ష్యంతో అన్నివర్గాలు ఒక్కటై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాయన్నారు. సిర్పూర్ తాలుకా చుట్టు నీళ్లు ఉన్నా ఒక్క ఎకరాకు పారే పరిస్థితిలేదని గతంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనబడుతుందని విమర్శించారు. సిపిఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి చాంద్ పాషా మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కారణంగానే ప్రాణహిత ప్రాజెక్ట్ ఇక్కడ నుండి తరలిపోయిందన్నారు. సమావేశంలో ఏఎంసి మాజీ చైర్మన్ చిట్యాల నర్సింగరావు, సిపిఐ (ఎంఎల్) నాయకుడు లాల్‌బహదూర్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్మరాం, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.