అదిలాబాద్

పెద్దలకు, పేదలకూ చట్టం సమానమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలమడుగు, జూలై 21: చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, న్యాయానికి గొప్ప, పేద అనే తేడా ఉండదని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ ఆథారిటీ సెక్రెటరీ జస్టిస్ బి ఆర్ మధుసూదన్‌రావు అన్నారు. శనివారం మండలంలోని ఝరి గ్రామంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకాగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక, కలెక్టర్ దివ్య, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి చేరుకున్న న్యాయమూర్తికి, అధికారులకు గ్రామస్థులు గుస్సాడీ నృత్యంతో గిరిజన సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. గ్రామంలో కుమురంభీం విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం సదస్సులో జస్టిస్ మధుసూదన్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిసేలా చేయడమే జాతీయ న్యాయసేవ సాధికారిక సంస్థ ఉద్దేశమన్నారు. జిల్లా కలెక్టర్ దివ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయని, దీంతో పంటలు పుష్కలంగాపండే అవకాశం ఉందన్నారు. రైతులు ముందస్తుగా గులాబీ పురుగు నివారణకోసం పొలాల్లో లింగాకార్షణ బుట్టలను ఏర్పాటు చేసుకొని పంటలను రక్షించుకోవాలన్నారు. వర్షాలు అధికంగా కురుస్తున్నందున నీరు కలుషితమై రోగాలు ప్రబలే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజలు తాగేనీటిని వేడిచేసి వడపోసుకొని చల్లార్చిన తర్వాత తాగాలని, వేడి ఆహారాన్ని తీసుకోవాలన్నారు. కలుషిత నీరు తాగడం వల్ల అతిసార వ్యాధి సోకి ప్రజలు మృత్యువాతపడే అవకాశం ఉందన్నారు. గత మాసంలో తాంసి మండలంలోని అట్నంగూడలో ఇద్దరు చనిపోయారని, 13మంది ఆసుపత్రుల్లో చేరారని గుర్తుచేశారు. వ్యాధులు సోకినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఆర్ ఎంపి వైద్యుల వద్ద చికిత్సలు చేయించుకొని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. జిల్లా న్యాయమూర్తి అరుణసారిక మాట్లాడుతూ నేషనల్ లీగల్ ఆథారిటీ ప్రకారం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదిగా న్యాయమూర్తులు, అధికారులు పనిచేస్తారన్నారు. సర్పంచ్ కావేరి జనక్ పటేల్ న్యాయమూర్తి వద్దకు తెచ్చిన సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్జీల స్వీకరణ కోసం ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. పిల్లలను అపహరిస్తున్నారనే వదంతులను నమ్మవద్దన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని సూచించారు. ఏదేనా వదంతులు వచ్చినట్లయితే సంబంధిత పోలీసు వాట్సాప్‌కు సమాచారం అందించాలన్నారు. అనంతరం వికలాంగులకు ట్రైసైకిళ్ళను పంపిణీ చేశారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ దివ్య, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ గిరిజన కాలనీలో తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహశీల్దార్ పవన్‌చంద్ర, ఎడీవో సునీత, ఎంపిపి సిడాం రాము, రైతు నాయకుడు ముడుపు కేదరీశ్వర్ రెడ్డి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీలను చెట్లు, రోడ్లతో అందంగా తీర్చిదిద్దండి
* రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల
లక్ష్మణచాంద, జూలై 21: రాబోయే రోజుల్లో ప్రతీ గ్రామంలో పచ్చని చెట్లు, మెరుగైన రోడ్లు ఉండేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని రాష్ట్ర న్యాయ, గృహనిర్మాణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం లక్ష్మణచాంద మండలంలోని చామన్‌పెల్లి, పీచర గ్రామల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవంచేశారు. గ్రామంలో వీడీసీ భవనం, పంచాయతీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. పీచర గ్రామంలో వ్యవసాయ గోదాము, పంచాయతీ భవనం, ప్రాథమిక పాఠశాలలో కిచెన్‌షెడ్‌కు, జడ్పీ హైస్కూల్‌లో అదనపు గదులకు మంత్రి ప్రారంభోత్స వం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలకు ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపుల, ఖాళీ స్థలాల్లో మొక్కలను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని, సుందరమైన రోడ్లను నిర్మించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధికప్రాధాన్యత ఇస్తుందన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, 24గంటల ఉచిత విద్యుత్ అందించడంతోపాటు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ కల్పించి రైతులను ఆర్థికంగా బలోపేతమయ్యేలా చూస్తుందన్నారు. సబ్సీడీ ట్రాక్టర్లను అందించడం జరుగుతుందన్నారు. వ్యవసాయాన్ని యాంత్రీకరణ దిశలో ప్రయాణించేందుకు రైతులకు హర్వేస్టర్లు సబ్సీడిపై అందిస్తుందన్నారు. ప్రతీ క్లస్టర్‌కు 20 ట్రాక్టర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నిరుద్యోగ యువతకు హార్వేస్టర్ల నడపడంలో శిక్షణ ఇవ్వనున్నామని మంత్రి తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు ప్రతీ గ్రామంలో ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకుని గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. అక్టోబర్ మాసాంతానికి జిల్లాలో మరుగుదొడ్డిలేని ఇళ్లు ఉండకూదన్నారు. అంతకుముందు చామన్‌పెల్లి గ్రామంలో ఇటీవల కుభీర్‌లో జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కత్తిపోట్లకు గురైన 5వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ ఇంటికి వెళ్లి అతనిని మంత్రి పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ నల్ల వెంకట్‌రాంరెడ్డి, ఎంపీపీ కౌసల్య గణేష్, జడ్పీటీసీ ఎ.పద్మ, ఏఎంసీ చైర్మన్ ధర్మాజిగారి రాజేందర్, టీఆర్‌ఎస్ కార్యదర్శి సత్యనారాయణగౌడ్, పాకాల రాంచందర్, చామన్‌పెల్లి సర్పంచ్ ఏనుగు లింగారెడ్డి, పీచర సర్పంచ్ రాజవ్వ, రఘునందన్‌రెడ్డి, ఎ.సురేంధర్‌రెడ్డి, తహశీల్దార్ నారాయణ, ఎంపీడీవో మోహన్, కృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హరితహారం లక్ష్యాన్ని అధిగమించాలి
* జిల్లాలో 76లక్షల మొక్కలు నాటాలి * కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
ఆసిఫాబాద్, జూలై 21: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాన్ని జిల్లాలో కలిసి కట్టుగా విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ సూచించారు. నిర్దేశించిన లక్ష్యా న్ని గడువులోగా అధిగమించాలని స్పష్టం చేశారు. శనివారం తన కార్యాలయంలో హరితహారంపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయా శాఖల అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 76లక్షల మొక్క లు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వీటిలో డిఆర్‌డిఏ ద్వారా 36 లక్షలు, అటవీశాఖ 20లక్షలు, వ్యవసాయ శాఖ 10 లక్షలు, మిగితా శాఖలన్నీ కలిసి మరో 10 లక్షల మొక్కలు నాటాల్సి ఉందన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా మొక్కలనునాటే ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. నాటిన ప్రతి మొక్కను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల్లో మొక్కలు నాటే ప్రక్రియను ఎంపిడిఓలు తీసుకోవాలన్నారు. గ్రామాలకు మొక్కలను చేరవేసేందుకు మండలాల వారీగా ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామాలకు తరలించిన మొక్కలను రిజిస్టర్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని పాటిల్ పేర్కొన్నారు. ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అధిక శాతం టేకు, పండ్ల మొక్కలైన దానిమ్మ, అల్లనేరేడు, నిమ్మ, జామ, పనస, మామిడి మొక్కలను ఈహరిత హారంలో నాటనున్నట్లు తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిని హరితహారంలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈసమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్, డిఆర్‌డిఏ పిడి వెంకటి, డిపిఓ గంగాథర్ గౌడ్, ఎక్సైజ్ అధికారిణి రాజ్యలక్ష్మి, ఎంపిడిఓలు, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.