అదిలాబాద్

హరితహారంలో సింగరేణి అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెబ్బెన, ఆగస్టు 14: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారాన్ని సింగరేణిలో ఉన్న అధికారులు ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నారని హరితహారంలో సింగరేణిలో అగ్రస్థానంలో ఉందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, కుమ్రంభీం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సింగరేణి అధ్వర్యంలో 4వ విడత హరితహారంలో భాగంగా గోలేటి వద్ద గల సిహెచ్‌పి ఆవరణంలో మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలలో సింగరేణి సంస్థ హరితహారంలో భాగంగా 3 కోట్ల మొక్కలు నాటడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. ఇప్పుడు 4వ విడతలో ప్రస్తుతం 1500 మొక్కలు నాటుతున్నామని తెలిపారు. అంతేకాకుండా సింగరేణి అధికారులు నాటిన మొక్కలను ప్రత్యేక శ్రద్దతో నీళ్లు పోస్తు వాటిని రక్షించడం గమనార్హం అన్నారు. బంగారు తెలంగాణకు మొక్కలు కూడా ఒక భాగమేనని అవి మానవ మనుగడకు ఎంతో ఉపయోగ పడుతాయని, మొక్కలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. హరితహారం అధికారులది కాదనీ అందరిది అని విద్యార్థుల పాత్ర ఎంతో ఉంటుందని ప్రతీ ఒక్క విద్యార్థి పుట్టిన రోజు సందర్బంగా ఒక్క మొక్కను పెంచితే వాతావరణంలో పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతారని తెలిపారు. ముఖ్యంగా హరితహారం - హరిత పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రతి ఒక్క విద్యార్థిచే మొక్కలు నాటించే ప్రత్యేక శ్రద్ద వహించే బాధ్యతతో మొక్కలు పెంచాలని వారు అన్నారు. గ్రామాలలోని మహిళలకు, వృద్దులకు హరితహారంపై అవగాహన కల్పించాలని అదే విధంగా అటవీ పోడు భూములలో మొక్కలను అటవీ అధికారులు చర్యలు తీసుకుంటే అడవులను పెంచిన వారు అవుతారని పేర్కొన్నారు. చెట్లు మానవ మనుగడకు పూర్వాభివృద్దికి ఎంతో ఉపయోగ పడుతాయని తెలిపారు. అనంతరం జీ ఎం రవిశంకర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 6 లక్షల మొక్కలను నాటడం లక్ష్యంగా తీసుకున్నామని ఇప్పటికే 3 లక్షల 30 వేల మొక్కలు నాటామని ఈ వారంలో 10 వేల పండ్ల మొక్కలను గ్రామాలలో పంచుతామని అన్నారు. 11 ఏరియాలలో ప్రత్యేక నర్సరీ మొక్కలను 50 రకాల మొక్కలను పెంచామని, ప్రాంగణంలో పండ్లను, వేరు శనగ మొక్కలను పెడుతున్నామని , మిగితా మొక్కలను డంపింగ్ యార్డ్‌లలో 130 హెక్టార్లలో పెంచుతున్నామని తెలిపారు. వాటికి ప్రత్యేకంగా రక్షక కవచాలు ఏర్పాటు చేసి నీళ్లు పోసి ఇప్పటికే చెట్లను తయారు చేశామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోవలక్ష్మి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డి ఎఫ్ ఓ లక్ష్మణ్ రంజీత్ నాయక్ లు మొక్కలను నాటారు. ముందుగా ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఏరియా సేవ సమితి అధ్యక్షురాలు పూల బూకేను ఇచ్చి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను అధికారి కొండయ్య పూల బూకేతో, డి ఎఫ్ ఓ లక్ష్మణ్ రంజీత్ నాయక్‌ను ఎస్ ఓ టూ జీ ఎం వీర స్వామి లు ప్రత్యేక పూల బూకేలతో ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం చెట్లపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ఓ లక్ష్మణ్ రంజీత్ నాయక్, ఎంపిపి సంజీవ్‌కుమార్, జడ్పిటిసి అజ్మిర బాబురావు, టిబిజికే ఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజు శ్రీనివాస్ రావు, జీ ఎం రవిశంకర్, నంబాల ఎంపిటిసి కొవ్వూరి శ్రీనివాస్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, సీనియర్ సేవ సభ్యురాలు సొల్లు లక్ష్మి, టి ఆర్ ఎస్ మహిళ విభాగం అధ్యక్షులు మాన్యం పద్మ, నాయకులు సోమశేఖర్, సుదర్శన్ గౌడ్, నవీన్ జైస్వాల్, ప్రకాశ్ రావులతో పాటు తదితరులు ఉన్నారు.