అదిలాబాద్

నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఉపాధి పొందండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, ఆగస్టు 14: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్ ద్వారా అందిస్తున్న నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఉపాధి అవకాశాలు పొందాలని రాష్ట్ర న్యాయ, గృహనిర్మాణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హితవు పలికారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని దివ్యాగార్డెన్స్‌లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ది సంఘం నిర్మల్ ఆధ్వర్యంలో ఎస్సీ నిరుద్యోగ యువతకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారి ఎస్సీ కార్పోరేషన్ ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలన్నారు. అప్పులు చేసి దుబాయ వెళ్లే బదులుప్రభుత్వం అందిస్తున్న శిక్షణను పొంది, భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల ప్రమేయం లేకుండా రుణ సౌకర్యం కల్పించుటకు కృషిచేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్సీ కార్పోరేషన్ వైస్ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ లచ్చిరాం బుక్యా మాట్లాడుతూ నిరుద్యోగ ఎస్సీ యువతకు మెరుగైన ఉద్యోగవకాశాలు కల్పించేందుకు 3 నెలలు, 6 నెలల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొంది తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రయత్నించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్సీ కార్పోరేషన్ ద్వారా నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరికేలా కృషిచేయనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి మాట్లాడుతూ దేశంలో 18-35 సంవత్సరాల యువత ఎక్కువగా ఉన్నారని, వచ్చే 15-20 ఏళ్లలో భారతదేశం నైపుణ్యం గల కార్మికులను విదేశాలకు అందించే స్థితిలో దేశం ఉంటుందన్నారు. యువత ముందుకువచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత 40 సంవత్సరాలలో మన జిల్లాలో 27 కోట్లతో భూమి కొనుగోలు పథకం కింద పేద దళిత కుటుంబాలకు భూమి పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎస్సీ యువతకు అవసరమయ్యే శిక్షణ ఇచ్చేందుకు గ్రూప్-1,2,3 పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, మున్సిపల్ చైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ నల్లా వెంకట్‌రాంరెడ్డి, అడెల్లి దేవస్థానం చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి, ఏ ఎస్పీ దక్షిణామూర్తి, కౌన్సిలర్ సుధాకర్, ఎస్సీ కార్పోరేషన్ ఈడి మాణిక్‌రావు, జిల్లా ఎస్సీ అభివృద్ది అధికారి కిషన్, వివిధ సంస్థల ప్రతినిధులు చంద్రశేఖర్, అయోధ్య రామారావు, నారాయణస్వామి, అబ్దల్ ఖాదర్, యువతీ, యువకులు తదితరులు పాల్గొన్నారు.