అదిలాబాద్

సామాజిక ఉద్యమంలా హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 14: భావితరాల మనుగడను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతున్నారని, సామాజిక ఉద్యమంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో నాల్గవ విడత గా 17 కోట్ల మొక్కలు నాటడం జరిగిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. నాల్గవ విడత హరితహారంలో భాగంగా మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్పీ కార్యాలయ ఆవరణలో, లిటిల్‌ప్లవర్ పాఠశాలలో విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి మంత్రి రామన్న మొక్క లు నాటారు. ఈ సంధర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా నేపథ్యంలో వాతావరణ సమతుల్యాన్నిపరిరక్షించేందుకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే గాక వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అడవులు అంతరించిపోవడం వల్లే వర్షాలు సకాలంలో కురియడం లేదని, దీంతో దుర్భిక్ష పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ వర్షాభావం కొరతతో రైతులు అల్లాడుతున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు ముందుకు వస్తున్నారని, రాష్ట్రంలో 17 కోట్ల మొక్కలు నాటితే, జిల్లాలో 2 కోట్ల పైచిలుకు మొక్కలు నాటడం జరిగిందన్నారు. పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు పాఠశాల ఆవరణలో కూరగాయల సాగు, పూల తోటల సాగుకు ముందుకు రావాలని, ఇందుకు ప్రభుత్వమే మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో 23 శాతం ఉన్న అడవులను 33శాతానికి పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ సంధర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్వర్యంలో జడ్పీ సిబ్బంది స్వచ్చందంగా మొక్కలు నాటారు. మంత్రి మొక్కలు నాటి నీరు పోశారు. శోభారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసి ఆర్ సమాజ హితం కోసం ముందుచూపుతో చేపడుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని, మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలన్నారు. జిల్లాను అడవుల జిల్లాగా ముందుకు తీసుకవెళ్ళాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జడ్పీ సి ఈవో జితెందర్ రెడ్డి, ఐసిడి ఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, హర్టికల్చర్ అధికారులు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి బోజారెడ్డి, రైతు సంఘం నాయకులు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.