అదిలాబాద్

కడెం ప్రాజెక్టు మూడు వరదగేట్ల ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, ఆగస్టు 17: కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా జలాశయంలో ఇన్‌ఫ్లో వరదనీరు వచ్చి చేరుతోంది. రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కడెం జలాశయంలో 23 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరదనీరు వచ్చి చేరడంతో నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తమై శుక్రవారం ప్రాజెక్టుకు చెందిన 2,11,12 నెంబరు గల వరదగేట్లను ఎత్తివేసి దాదాపు 28 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు జలాశయంలో 13వేల 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నీరు వచ్చి చేరుతుందని కడెం నీటి మట్టం 693.700 అడుగులకు ఉందని స్థానిక నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు.