క్రైమ్/లీగల్

సబ్సిడీ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, ఆగస్టు 24: మందమర్రి నుండి మహారాష్టక్రు తరలిస్తున్న సబ్సిడీ బియ్యాన్ని రామగుండం టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. మహారాష్టల్రోని వీరూర్‌కు రైలులో బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేస్తుండగా 15క్వింటాళ్ల సబ్సిడీ బియ్యా న్ని పట్టుకున్నట్లుగా టాస్క్ఫోర్సు సీఐ బుద్దెస్వామి తెలిపారు. వీటి విలువ రూ.15వేలు ఉంటుందన్నారు. సబ్సిడీ బియ్యంను పట్టుకున్న నిందితులు తదుపరి చర్య కొరకు మందమర్రి పోలీస్ స్టేషన్‌లో అప్పగించడం జరిగిందన్నారు. దాడిలో టాస్క్ఫోర్సు ఎస్సై సమ్మయ్య, శ్రీనివాస్, సిబ్బంది ఓంకార్, వెంకటేశ్వర్లు, శ్యాం, భాస్కర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

బాలిక ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

నిర్మల్, ఆగస్టు 24: తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన వెంటనే ప్రభుత్వం బాలికల చదువు, ఆరోగ్య పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన బాలికా ఆరోగ్య రక్ష కిట్‌లను పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే బాలికల, మహిళల విద్యా, సంక్షేం ఆరోగ్య పరిరక్షణకు ఆధిక ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుందని వెల్లడించారు. ఆరోగ్యమే మహభాగ్యమని, బాలికలు ఆరోగ్యంగా ఉంటెనే బాగా చదువుతారని అందుకోసమే పాఠశాలలో చదివే విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకై హెల్త్ అండ్ హైజీన్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం అన్నిపాఠశాలల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా పరిశుభ్రమైన తాగు నీళ్లు అందించనునట్లు పేర్కొన్నారు. విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని బాగా చదవాలని సూచించారు. బాలికలు ఐ ఏ ఎస్, ఐపీ ఎస్, ఇంజనీర్లు, డాక్టర్‌లు, రాజకీయ నాయకులుగా తల్లితండ్రుల అశయాలకు అనుగుణంగా చదువుల్లో రాణించాలని సూచించారు. జిల్లాలో కంటి వెలుగు పథకం కింద 16 బృందాలతో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. హరితహరంలో భాగంగా మొక్కలు నాటాలని తెలిపారు. చెట్లు పెంచి భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. సమాజంలో భాగంగా ఉన్న మహిళలు అన్నిరంగాల్లో రాణించి ఆభివృద్ది చెందాలనే సంకల్పతంతోనే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. మంత్రి బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, నిర్మల్ ఏఎంసీ చైర్మన్ రాజేందర్, జిల్లా విద్యాధికారి ప్రణీత, పీ ఏసీ ఎస్ చైర్మన్ జివన్‌రెడ్డి, సెక్టొరల్ ఆధికారిణీ సలోమి కరుణ, టీఆర్‌ఎస్ ఆధికార ప్రతినిధి సత్యనారాయణ, పాకాల రాంచందర్, ఎన్ ఆర్ ఈజీ ఎస్ సభ్యులు హరీష్‌రావు, కౌన్సిల్ భూపతి రెడ్డి, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.