అదిలాబాద్

తాజా మాజీలపై ఇంటలిజెన్స్ నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, సెప్టెంబర్ 12: బెల్లంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే చిన్నయ్యకు మొదటి బెర్త్‌లోనే టికెట్ ఇవ్వడం నియోజకవర్గ ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఇప్పటికే ఆయన అనేక ఆరోపణలు, నోరు పారేసుకున్న సంఘటనలు ఎన్నో జరిగాయి. ఆయన రాప్ట్ర వ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కారు. ఆయన పదవీ కాలంలో పాల్పడ అనేక సంఘటనలపై ఇంటలిజెన్స్‌వర్గాల స్వయంగా సీఎం కేసీఆర్‌కు గతంలో నివేదికలు పంపాయి. మాజీ ఎమ్మెల్యే చిన్నయ్యను కేసీఆర్ పలు దఫాలు హైదరాబాద్‌కు పిలిపించుకొని మందలించిన ఘటనలూ ఉన్నాయి. టికెట్ చిన్నయ్యకు వస్తుందా అనే ప్రశ్న బలంగా వినిపించగా కేసీఆర్ మొదటి బెర్త్‌లోనే చిన్నయ్యకు టికెట్ ఖరారు చేయడం అటు రాజకీయవర్గాలు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను విస్మయానికి గురి చేసింది. నిజానికి ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకత, ఆసమ్మతి సెగలు కొండెక్కాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యవహార శైలి మండలాల్లో పర్యటన ఆయన పాల్గొంటున్న కార్యక్రమాలలో జన సమీకరణ హాజరవుతున్న నాయకుల వివరాలను క్యాంపు కార్యాలయాలకు రాకపోకలు తదితర అంశాలపై ఇంటలిజెన్స్ వర్గాలు పూర్తిగా నిఘా పెట్టారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 105 మంది అభ్యర్థుల టికెట్ల ప్రకటనతో ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌బాద్ జిల్లాలో ఆసమ్మతి సెగలు రోడ్డెక్కాయి. దీంతో ప్రకటించిన అభ్యర్థులలో 20 నుండి 30మందిపై నిఘా పెట్టిన ఇంటలిజెన్స్ వర్గాలు పరిస్థితులను ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికల రూపంలో పంపుతున్నట్టు సమాచారం. దీన్లో భాగంగానే ప్రధానంగా బెల్లంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అభ్యర్థిత్వంపై, మంచిర్యాల తాజా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, ఆసిఫాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఖానాపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్ తదితర అభ్యర్థిత్వాన్ని మార్చాలని యోచిస్తున్నట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది.

గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు పట్టాలు ఇప్పించాలని వినతి
బెల్లంపల్లి, సెప్టెంబర్ 12: పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో సర్వే నెంబర్ 170/8 లో గుడిసెలు వేసుకున్న నిరుపేద దళితులకు పట్టాలు ఇప్పించాలని కోరుతూ బుధవారం ఎంసిపి ఐ యూ పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఎంసిపి ఐ యూ జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో 170/8 సర్వే నెంబర్‌లో 2016 లో 30 మంది దళితులు గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. సింగరేణి అధికారులు గుడిసెలను ధ్వంసం చేసి 18 మందిపై పోలీసులు కేసులు పెట్టించారని సబ్ కలెక్టర్‌కు విన్నవించారు. ఈ దళితులకు పట్టాలు ఇప్పించి పోలీస్ కేసులు రద్దు చేసే విదంగా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొండ శ్రీనివాస్, సబ్బని రాజేంద్ర ప్రసాద్, కొంట్రాంగి రాజ్ పటేల్, దుర్గం విఠల్, లింగంపల్లి శంకర్, లింగంపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి
* టీబీజీకేఎస్ కార్పొరేట్ చర్చల కమిటీ ప్రతినిధి మంగిలాల్
తాండూర్, సెప్టెంబర్ 12: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి టీబీజీకేఎస్ నిరంతరం కృషి చేస్తున్నదని ఆ యూనియన్ కార్పొరేట్ చర్చల కమిటీ ప్రతినిధి ధరావత్ మంగిలాల్ అన్నారు. మాదారంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి కార్పొరేట్ స్టక్చర్ కమిటీ సమావేశంలో పొందపర్చిన కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. 2011 తర్వాత డెయిలిరేటెడ్ నుండి మంత్లీ పెయిడ్‌గా మారిన వారికి ఇంక్రిమెంట్ విషయంలో అవకతవకలు జరుగుతున్నయని టీబీజీకేఎస్ యాజమాన్యం దృష్టికి తెగా, వారికి ఇంక్రిమెంట్ తిరిగి ఇవ్వడానికి అంగీకరించడం జరిగిందన్నారు. మైనార్టీ బెనిఫిట్ 01.09.2018 నుండి లభిస్తుందన్నారు. మైనింగ్ డిప్లొమ, డిగ్రీ చేసి ఉన్నవారికి అప్రెంటిషిప్ ఇప్పించుటకు సర్క్యులర్ ఇప్పించడం జరిగిందన్నారు. డిప్లొమ వారికి 2019 జనవరి నుండి ఆయా జీఏంలకు దరఖాస్తులు పెట్టుకోవాలని ఆయన సూచించారు. క్యాడర్ స్కీంను కూడా సాధించడం జరిగిందన్నారు. కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే ధ్యేయమే టీబీజీకేఎస్ ముందుండి పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో నాయకులు దుగుట శ్రీనివాస్, భూమయ్య, ఎర్రయ్య, రామస్వామి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.