అదిలాబాద్

ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 12: ముందస్తు ఎన్నికలకు జిల్లా యంత్రాం గం సన్నద్ధమైంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఈక్రమంలో ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సామాగ్రి బుధవారం జిల్లా కేంద్రానికి చేరుకొంది. మరోవైపు ఓటరు జాబితాను ఈనెల 25వ తేదీలోగా పూర్తి చేయడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటరు జాబితాలో అవసరమైన మార్పులు, చేర్పు లు చేయనున్నారు. ప్రధానంగా స్థానికంగా ఉండని, చనిపోయిన ఓటర్ల పేర్లను తొలగించడంతోపాటు, కొత్త ఓటర్ల పేర్లను చేర్చే ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తులు మొదలెట్టారు. ఇంతకు ముంద టి ఓటరు జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 3.48.710 ఓటర్లుండగా, వీరిలో పురుషులు 1.76.332, మహిళలు 1.72.312, ఇతరులు 66మంది ఓటర్లున్నారు. నియోజకవర్గాల వారీగా ఆసిఫాబాద్ నియెజకవర్గంలోని పది మండలాల్లో 1,72,287, సిర్పూర్ నియోజకవర్గంలో 1.76,423 మంది ఓటర్లున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. 334 గ్రామపంచాయతీల్లో 532 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 600 ఇవి ఎంలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం భారీ బందోబస్తు మధ్య జిల్లాకేంద్రానికి ఎన్నికల సామగ్రిని తరలించారు. తొలి విడతగా హరియాణా రాష్ట్రం నుండి 850బ్యాలెట్ యూనిట్స్, 670కంట్రోల్ యూనిట్స్ రాగా, వీటిని మార్కెట్ కమిటీ ఆవరణలోని గోదాంలో భద్రపరిచారు. వీటితోపాటు మరో 720 వివి పాట్‌లు రావాల్సి ఉంది. వీటి నిర్వహణపై అధికారులు, ఎన్నికల సిబ్బంది త్వరలోనే శిక్షణ ఇవ్వనుండగా, రాజకీయ పార్టీల నేతల ముందు ట్రయల్ రన్ చేయనున్నారు. మరోవైపు మార్పులు, చేర్పుల అనంతరం కొత్త ఓటరు జాబితా అందుబాటులోకి రానుంది. ఇదిలాఉండగా, ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే పోలీసు యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. ఈపాటికే జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో పోలింగ్ స్టేషన్ల వివరాలు, సున్నిత, అతి సున్నిత గ్రామాలను గుర్తించేందుకు పోలీసు శాఖ చర్యలు మొదలెట్టింది. గ్రామాల్లోకి వెలుతూ వివరాలు సేకరిస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం ఉపయోగించే సామాగ్రి బుధవారం జిల్లా కేంద్రానికి చేరాయి. వీటిలో 850 బ్యాలెట్ యూనిట్స్, 670 కంట్రోల్ యూనిట్స్ ఉన్నాయి. రాజకీయ పార్టీల నేతల సమక్షంలో ఈ పెట్టెలను అత్యంత సురక్షితంగా మార్కెట్ యార్డులోని ఓ గోదాంలో బధ్ర పరిచారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు డిఆర్‌వో రాజేశ్వర్, ఆర్డీవో సురేష్ కదం, తహశీల్దార్ బౌమిక్, ఎస్‌హెచ్‌ఓ మల్లన్న, డిప్యుటీ తహశీల్దార్ ఎలక్షన్ జితేందర్‌లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సామాగ్రి భద్రతకు తీసుకోవాల్సిన చర్చల గురించి అధికారులు చర్చించారు. కాగా, ఈ సామాగ్రి గోదాంలోకి చేరే వరకు డిసిసి ప్రధాన కార్యదర్శి విశ్వప్రసాద్ రావు, బిజెపి కౌన్సిల్ సభ్యుడు సతీష్ బాబు, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గాదెవేని మల్లేష్, మాజీ ఎంపిపి బాలేశ్వర్ గౌడ్, బిఎస్‌పి నాయకుడు వైరా గడే పోషం తదితరులున్నారు.