అదిలాబాద్

కేసీఆర్ పాలనలోనే బీసీ వర్గాల అభ్యున్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, సెప్టెంబర్ 12: బీసీ వర్గాల ఆర్థిక స్థాయిని పెంచిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రామన్నతో పాటు డెయిరీ కార్పోరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి బోజారెడ్డి, జడ్పీటీసీ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో మంజూరైన వంద శాతం రాయితీ గల రూ.50వేల చెక్కులను 309 మంది లబ్దిదారులకు మంత్రి పంపిణీ చేశారు. అనంతరం రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన బీసీలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. నియోజకవర్గంలోని రజక, కుమ్మరి, గంగపుత్ర తదితర కులాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వారి ఆర్థిక స్థాయిని పెంపొందించేందుకు సి ఎం కేసీఆర్ ఈ బడ్జెట్‌లో రూ.1,478 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా 2.26 లక్షల మందికి రుణాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, మొదటి విడత కింద జిల్లాలో 309 మందికి 1.54 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికలు ముందుగా రావడంతో మిగితా వారికి అక్టోబర్ 10లోగా లక్ష, రెండు లక్షల యూనిట్లకు రుణాలు అందజేస్తామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రవేశపెట్టని ఎన్నో సంక్షేమ అభివృద్ది పథకాలను ముఖ్యమంత్రి కెసి ఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఆశమ్మ, గంగారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికకారి ఆశన్న తదితరులు పాల్గొన్నారు.

గరం గరంగా ప్రజావేదిక
* తోపులాడుకున్న ఇరువర్గాలు
దండేపల్లి, సెప్టెంబర్ 12: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి గోళ్ళ మంజుల అధ్యక్షతన నిర్వహించిన ఉపాధి హామి 10 వ విడిత ప్రజా వేధిక గరం గరంగా సాగింది. మండలంలోని పెద్దపేట గ్రామ క్షేత్రసహయకుడు సరిగా పని చేయడం లేదని కూలి డబ్బులు ఇప్పించడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయగా కావాలనే రాజకీయం చేస్తున్నారని మరో వర్గం ప్రజలు ఆందోళనకు దిగి పరస్పరం తోపులాటకు దిగడంతో పోలీస్‌లు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింప చేశారు. నర్సాపూర్ గ్రామంలో ఉపాధి హామీ నిధులు అవకతవకలకు పాలుపడ్డరని వేంటనే బాధ్యులలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కూలీలు, యూత్ సభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వేధిక రాత్రి పోద్దుపోయే వరకు కూడ కోనసాగే అవకాశాలు ఉండటంతో పూర్తి వివరాలు గురువారం వేల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఎపిడి శంకర్, తహశీల్దార్ రామచంద్రయ్య, ఎంపిడివో టి.శ్రీనివాస్, విలజీలెన్స్ అధికారి సుధాకర్, ప్రాజెక్ట్ అధికారి రాజశేఖర్, ఎస్సార్పి రాము, ఇసి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.