అదిలాబాద్

ప్రాణ త్యాగానికైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, సెప్టెంబర్ 12: ప్రజా పోరాటాలలో ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెన్నూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపీ బాల్క సుమన్ అన్నారు. బుధవారం చెన్నూర్ కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించానన్నారు. తన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో పెద్దపల్లి ఎంపీగా పోటీచేసే అవకాశం ఇచ్చారని, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణలో భారీ మెజార్టీతో మూడో స్థానంలో గెలిపించారన్నారు. ప్రస్తుతం కేసీఆర్ చెన్నూర్ అసెంబ్లీ టికెట్ కేటాయించారని, ప్రజల ఆశీర్వాదంకోసం చెన్నూర్ వచ్చిన తనపై హత్యయత్నం చేయడం సరికాదన్నారు. చెన్నూర్ నుండే పోటీ చేస్తానని ప్రజల సాక్షిగా చెబుతున్నానన్నారు. ప్రజలపక్షాన పోరాడేందుకు శుక్రవారం నుండి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ప్రచారం చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, టీబీజీకేఎస్ నాయకులు కెంగర్ల మల్లయ్య, టీఆర్‌ఎస్ నాయకులు వాల శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్ నుంచే పోటీ చేస్తా
చెన్నూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఎంపి సుమన్ అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమానికి వెళ్తుండగా ఇందారం వద్ద ప్రజలు స్వాగతం పలికారు. ఇందారంలో చోటు చేసుకున్న అపశృతి అనంతరం ఆయన మాట్లాడారు. 2001 నుండి కేసీఆర్ వెంటే ఉండి పని చేశానన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను కేసీఆర్‌ను టికెట్ అడుగలేదని.. ఆయన స్వయంగా తనకు చెన్నూర్ టికెట్ కేటాయించారన్నారు. ఈప్రాంతం నుంచే పోటీచేసి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొంది ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే అనుచరులు పెట్రోల్ పోసి నిప్పు అంటించే ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు పోలీసులు, గన్‌మెన్‌లు అడ్డుకున్నారన్నారు. ఎన్ని హత్యా ప్రయత్నాలు చేసిన భయపడేదిలేదని ఎట్టి పరిస్థితుల్లోనూ చెన్నూర్ నుండే పోటీ చేస్తానని ముక్తకంఠంతో అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో భాగంగా ఇందారంలో నిర్వహించిన ర్యాలీకి వచ్చిన మీడియా మిత్రులపై కూడా పెట్రోల్ పడటంతో మంటలు అంటుకొని గాయలపాలయ్యారన్నారు. వెంటనే వారిని ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తో ఆసుపత్రులకు తరలించడం జరిగిందన్నారు. కార్యకర్తలను, మీడియా మిత్రులకు గాయాలు కావడంతో వారిని పరామర్శించారు.