అదిలాబాద్

ఆదివాసీలకు టికెట్లు ఇవ్వకపోతే సత్తాచూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, సెప్టెంబర్ 17: రాబోయే ఎన్నికల్లో ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లో ఆయా రాజకీయ పార్టీలు ఆదివాసీలకే టికెట్లు ఇవ్వాలని, లేనిపక్షంలో తుడుం దెబ్బ అధ్వర్యంలో ఆదివాసీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు అన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ఆదివాసీ ఐక్యత సదస్సు మాజీ ఐటిడి ఏ చైర్మెన్ సిడాం భీంరావు అధ్యక్షతన నిర్వహించగా సోయంబాపురావు పాల్గొని మాట్లాడారు. బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ తరపున సీఎం కెసిఆర్ లంబాడా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి ఆదివాసీల ఉద్యమాన్ని తక్కువ అంచనా వేసి అవమానం చేశారని, రాబోయే ఎన్నికల్లో ఆదివాసీ గిరిజనులను బరిలో దింపి తగిన బుద్దిచెబుతామని అన్నారు. అభ్యర్థుల విషయంలో పట్టించుకోని రాష్ట్ర మంత్రి జోగురామన్నతో పాటు బోథ్, ఖానాపూర్‌లోని రేఖానాయక్, రాథోడ్ బాపురావులను ఓడిస్తామని అన్నారు. అదే విధంగా ఆదివాసీ గూడేలకు రానివ్వద్దని, ఒకవేళ ఆదివాసీలు వెంబడి ఉన్నట్లయితే వారిని పంపించేయాలన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సైతం ఆదివాసీలకు అన్యాయం చేస్తే సహించమని అన్నారు. ఆదివాసీల అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరు ఓటుతో పాటు వంద రూపాయల నోటు అభ్యర్థులకు ఇచ్చి వారికి అండగా ఉంటామని అన్నారు. ప్రతి గ్రామంలోకి వెళ్ళి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రచారం చేయాలన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనేతరులు మనకు శత్రువులు కాదని, వారు మిత్రులేనని, వారిపట్ల సానుకూలంగా పనిచేస్తూ వారికి సమస్యలు తీసుకరావద్దని అన్నారు. గిరిజనేతరుల ఓట్లు కీలకమని, వారికి ఆదివాసీ గిరిజనులు అండగా ఉంటూ ముందుకెళ్ళాలని అన్నారు. మాజీ ఎంపి రాథోడ్ రమేష్ తన స్వలాభం కోసం గిరిజనేతరులు, ఆదివాసీల మద్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని గిరిజనేతరుల సోదరులు అర్థం చేసుకొని తమకు మద్దతు ఇవ్వాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాథోడ్ రమేష్ ఓటమికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసారి ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లో ఆదివాసీ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేయాలని, ఒకవేళ ఓడిపోతే సమాజం క్షమించదని అన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యమంలో ప్రతి ఒక్కరు కలిసి రావాలని అన్నారు. యువత సైతం సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొంటూ విలువైన సమయాన్ని దుర్వినియోగం చేయకుండా లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించే ఉద్యమంలో కలిసిరావాలన్నారు. కొంత మంది నాయకులు మృతి చెందిన కుటుంబాలకు డబ్బులు పంచుతూ ఓట్లకోసం గాలం వేస్తున్నారని, వారి ఉచ్చులో పడవద్దని గుర్తుచేశారు. ఈ సంధర్భంగా లంబాడా అభ్యర్థుల వెంట ఆదివాసీ గిరిజనులు తిరగవద్దని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రొఫెసర్ అమ్రాజ్ మాట్లాడుతూ ఒకప్పుడు రాజ్యాలు ఏలి కోటలు కట్టుకున్న ఆదివాసీలు నేడు ఇతర పార్టీల వెంట తిరగడం సబబు కాదన్నారు. ఆదివాసీ తెగలు రాబోయే ఎన్నికల్లో ఐక్యమత్యంగా ఉంటూ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇదిలా ఉండగా పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఇవ్వాలని సూచించగా సుమారు 18 మంది ఆదివాసీ గిరిజనులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏటిడబ్ల్యూఏసి చైర్మెన్ కనక లక్కెరావు, జిల్లా సార్‌మెడి మెస్రం దుర్గు, కనక తుకారాం, అర్క కమ్ము, మర్సుకోల తిరుపతి, వెడ్మబొజ్జు, బొంత అశారెడ్డి, నాగనాథ్, లీలావతి, ఆత్రం సుగుణ, కోట్నాక్ రమేష్, భీంరావు, సట్ల అశోక్, నాగోరావు, మాణిక్‌రావు, బాపురావు, కుమ్ర ఈశ్వరిబాయి, రాంకిషన్, గాంధారి సుంకట్‌రావు తదితరులు పాల్గొన్నారు.