అదిలాబాద్

ఉద్యమ నాయకులపై దాడులు, అక్రమ కేసులపై పోరాడాలి ‚

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, సెప్టెంబర్ 17: కేంద్రంలో, రాష్ట్రంలో ఉద్యమ నాయకులపై హత్యలు, దాడులు, అక్రమ కేసులు పెరిగి పోతున్నాయని వాటికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రగతిశీల మహిళ సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య పిలుపునిచ్చారు. సోమవారం మంచిర్యాల జిల్లాలో జరిగిన జిల్లా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలపై రోజు రోజుకు ప్రేమ పేరుతో దాడులు, హత్యలు, కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై హత్యలు జరుగుతునే ఉన్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన చట్టాలను చుట్టాలుగా మారడం వల్లే దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మహిళ చట్టాలను కఠినంగా అమలు చేయాలని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను తిప్పి కొట్టాలని తెలిపారు. శ్రామిక మహిళలకు 8 గంటల పని విధానం, అమలుకై శ్రామిక మహిళకు భధ్రత కల్పించుటకై విషయ సంస్కృతిపై వ్యతిరేకంగా పోరడాలని తెలిపారు. ప్రేమ పేరుతో హత్యలు, ఆత్యాచారాలు చేసే వారిని కఠినంగా శిక్షించాలని, గృహా హింసలకు, వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని అన్నారు. శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనాలకు పోరాడాలని , వివిధ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ప్రగతిశీల మహిళ సంఘం పోరాటాలకు ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు నూతన కమిటిని కూడా ఎన్నుకున్నారు. నూతన కమిటికి అధ్యక్షురాలుగా పద్మ, ఉపాధ్యక్షురాలుగా ఆదిలక్ష్మి, సువర్ణ, ప్రధాన కార్యదర్శిగా దాది రోజ, సహాయ కార్యదర్శి వైశాలి, హాసీనా బేబి, కోశాధికారిగా లావణ్య, కమిటి సభ్యులుగా రాజక్క, విజయ, సునీత, రజిత, రమ, సుమ, వజ్రక్క, లక్ష్మి, రాణి, లావణ్య, రజిత, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.