అదిలాబాద్

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి ప్రజావాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, సెప్టెంబర్ 17: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి ప్రజావాణి నిర్వహిస్తునట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. తానూర్ మండలంలోని మొగలి గ్రామానికి చెందిన గంగారాం రెవెన్యూ రికార్డులో మార్పులు చేయాలని, ముధోల్‌కు చెందిన కైసర్ బేగం వారసత్వ దృవీకరణ పత్రం ఇవ్వాలని, లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌కు చెందిన గంగవ్య భూమి పట్టా మంజూరు చేయాలని, ముధోల్‌కు చెందిన పోశట్టి, తుకారం డబుల్ బెడ్‌రూం మంజూరు చేయాలని, పించన్ మంజూరు చేయాలని నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లికి చెందిన లక్ష్మీ, ఆశన్న, లక్ష్మీ కోరగా వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో డీ ఆర్‌డీ రమేష్ రాథోడ్, డీ ఎఫ్‌వో దామోదర్‌రెడ్డి, డీ ఎం అండ్ హెచ్‌వో జలపతినాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మానిక్‌రావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. సురేష్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్జీల పరిష్కారంలో జాప్యం తగదు
* పీవో కృష్ణ ఆదిత్య
ఉట్నూరు, సెప్టెంబర్ 17: గిరి దర్బార్‌కు వచ్చే ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటిడి ఏ సమావేశ మందిరంలో గిరి దర్బార్ కార్యక్రమం నిర్వహించగా ప్రాజెక్టు అధికారి గిరిజనుల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సంధర్భంగా జైనూర్ మండలం జెండాగూడకు చెందిన మెస్రం దూరి పట్టాపాసు పుస్తకాలు ఇప్పించాలని, కెరమెరి మండలం కరంజివాడకు చెందిన పూజిత ట్రైకార్ రుణం ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా ఆసిఫాబాద్ మండలం జనకాపూర్‌కు చెందిన పంగిడి లక్ష్మి ఉపాధి కోసం ఆర్థిక సాయం అందించాలని, ఆసిఫాబాద్ మండల కేంద్రానికి చెందిన సాయిసత్యం ట్రైకార్ రుణాలు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. లింగాపూర్ గ్రామానికి చెందిన సరోజ ఏఎన్‌ఎం ఉద్యోగం కోసం, నార్నూర్ మండలం తహడిహత్నూర్‌కు చెందిన అశ్విని కుట్టు మిషన్ ఇప్పించాలని, ఉట్నూరుకు చెందిన సావిత్రి బి ఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశం ఇప్పించాలని, ఇచ్చోడ మండలం మోర్కండి గ్రామానికి చెందిన శ్రీదర్ సిఆర్‌టీ అవకాశం కల్పించాలని, జైనూర్ మండలం కొలాసకు చెందిన రత్నమాల సిఆర్‌టీగా ఉద్యోగం కల్పించాలని, ఇంద్రవెల్లికి చెందిన సోయం శంకర్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పాటు మరికొంత మంది గిరిజనులు వారి వారి సమస్యలతో ఆర్జీలు పెట్టుకోగా వాటిని పరిష్కరిస్తామని పీవో హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఏపీవో జనరల్ కనక భీంరావు, డిడి చందన, రాయిసిడాం చిత్రు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలి ‚
* జిల్లా జాయింట్ కలెక్టర్ సురేందర్
మంచిర్యాల, సెప్టెంబర్ 17:ప్రజా వాణికి వచ్చే ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై సురేందర్ రావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఆయా శాఖల అధికారులు సమన్వయంతో త్వరిత గతిన సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన గోనే పెద్ద పోశం తన దరఖాస్తులో 30 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలలో అస్తులు కొట్టుకుపోయిన దాదాపు 400 మంది కలిసి గీతానగర్ పేరిట ఒక కాలనీలో ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్నామని తెలిపారు. 3 గుంటల స్థలంలో ఇల్లు నిర్మించుకున్నానని మండల తహసీల్దార్ నాకు ఎలాంటి నోటిసులు, సమాచారం లేకుండా ఇంటికి సంబంధిత పత్రాలు చూపించిన వినకుండా ఇంటి ప్రహారీ గోడ, మరుగుదొడ్డిని కూల్చి వేశారని దీనిపై విచారణ జరిపి దళితుడను అయిన నాకు న్యాయం చేయాలని కోరారు. మందమర్రి మండలానికి చెందిన ఆవునూరి శంకరయ్య, అందుగుటపేట శివారులో పలు సర్వే నెంబర్‌లలో భూమిని రిజిస్టేషన్ దస్తావేజుల ద్వారా కొనుగోలు చేశానని రెవెన్యూ శాఖనుండి ప్రొజిడింగ్ కూడా పోందానని పది ఎకరాలలో మామిడి తోట వేయడం జరిగిందని ఇప్పుడు ఒక ముఠా స్థానిక ఎస్సైతో కలిసి సోలార్ పవర్ ఫ్లాంట్‌కు ఇట్టి భూమిని అమ్మి మమ్మల్ని అక్కడనుండి పారిపోయేలా చేసి మాపై అక్రమ కేసులు నమోదు చేశారని దాడి చేశారని తెలిపారు. ఆ భూమిపై విచారణ జరిపి మాకు తగ్గు న్యాయం చేయాలని ఆర్జీ ద్వారా కోరారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని అడ్వాటైజ్‌మెంట్ బోర్డ్సు టి స్ట్రక్చర్ టెండర్‌లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పత్రిక ప్రకటనలు ఇవ్వకుండా టెండర్‌ల గడువు ముగిసిన 3 నెలలు పొడగించారని, నామమాత్రంగా టెండర్ దారులను పిలిచి టెండర్‌ను వాయిదా వేయడం జరిగిందని దీనిపై విచారణ జరపాలని కోరుతూ బీ ఎస్పి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. మంచిర్యాలకు చెందిన మర్సికొల్ల సంధ్యకు గొర్రెల యూనిట్ నిర్వహాణ కోసం ఎస్టి కార్పోరేషన్ ద్వారా బ్యాంకు ద్వారా రాయితీ రుణం మంజూరు చేశారని ఇంత వరకు రాయితీ డబ్బులు విడుదల చేయలేదని, వెంటనే రాయితీ డబ్బులు విడుదల చేసే విధంగా చూడాలని కోరారు. లక్సెట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముత్తినేని గంగవ్వ నాకు చందారం శివారులో 33 గుంటల భూమి ఉందని దీనికి అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పట్టా దారు పాస్ పుస్తకం కలిగి ఉన్నానని తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న పట్టా పాస్ పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్త అందజేశారు. దండేపల్లి మండలకేంద్రానికి చెందిన గుంపుల రవి ఎస్టి కులానికి చెందిన అమ్మాయిని కులాంతర వివాహాం చేసుకున్నానని కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నానని మాకు వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వ భూమి ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణంలోని ఎన్టీ ఆర్ కాలనీకి చెందిన అత్తారం రాంబాయి నా భర్త మృతి చెందాడని నా కుమారుడు ఐ టి డి ఏ పథకం ద్వారా మోటర్ క్యాబ్ తీసుకున్నారని తరువాత కుమారుడు కోడలు మరణించారని ప్రస్తుతం మనువడి సంరక్షణ చూసుకుంటూ జీవిస్తున్నానని క్యాబ్‌కు సంబంధించిన రుణం మాఫీ చేయాలని కోరుతూ దరఖాస్తును అందజేశారు. ఈ ప్రజా ఫిర్యాదుల విభాగానికి 250 దరఖాస్తులు వచ్చాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.