అదిలాబాద్

ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముధోల్, సెప్టెంబర్ 18: ప్రజల అభ్యున్నతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ముధోల్ మాజీ ఎమ్మెల్యే, తెరాస అభ్యర్థి జీ. విఠల్‌రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలోని నారుూబ్రహ్మణ సంఘం భవన నిర్మాణానికి మంజూరైన 2లక్షల నిధుల ప్రొసిడింగ్‌ను సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిందని వెల్లడించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు బాసటగా కార్పొరేషన్‌ల ద్వారా సబ్సిడీ రుణాలు అందించిందని అన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థినులకు ఆధునిక, నాణ్యమైన విద్యను అందించడానికి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పేదకుటుంబాలకు చెందిన యువతుల పెళ్లిల కోసం కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనకై తెరాసకు మద్దతు తెలపాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని వివరించారు. రైతులను రాజు చేయడానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరాను చేస్తుందని తెలిపారు. అదేవిధంగా రైతులు కష్టపడి పండించిన ధాన్యం విక్రయించడానికి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరను కల్పించిందని అన్నారు. అదేవిధంగా రైతులకు ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించిన ఘనత తెరాస ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. రైతులు ఖరీఫ్ సీజన్‌లో పెట్టుబడులకు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎకరానికి రూ 4ల చొప్పున సాయం అందించిందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసిందని వివరించారు.

కంటివెలుగు వేగవంతం చేయాలి
-కలెక్టర్ దివ్య దేవరాజన్
ఆదిలాబాద్ మున్సిపాలిటీ,సెప్టెంబర్ 18: జిల్లాలో జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, జిల్లా ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసంధర్భంగా కంటి వెలుగు కార్యక్రమంలో సభ్యుల సంఖ్యను మరింతగా పెంచాలని సూచించారు. లక్ష్యాన్ని చేరుకునే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. వెనకబడిన ప్రాంతాలను ఓవర్స్‌స్ట్ఫా సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి రోజు తప్పకుండా 300 మంది సభ్యులకు కంటి పరీక్షలు నిర్వహించాలని, కంటి పరీక్షలకు వచ్చే సభ్యులకు విశ్రాంతికోసం, నీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. సభ్యులను పరీక్ష కేంద్రాలకు తరలించడం కోసం ఐకెపి సభ్యుల మద్దతు తీసుకోవాలన్నారు. మండల అధికారుల సాయాన్ని సైతం తీసుకోవాలని ఆదేశించారు. కెసి ఆర్ కిట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలపై సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రస్తుత ప్రసవాలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఆసుపత్రుల్లో ప్రసవాలు మరింత పెరగాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో పిహెచ్‌సిల వారీగా స్ట్ఫా పోజిషన్‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈవీఎంలు పరిశీలించిన కలెక్టర్
మంచిర్యాల, సెప్టెంబర్ 18: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు చేరిన ఏ వీ ఎం ల మిషన్ బ్యాలెట్ యూనిట్ వీపిపిటి ల మొదటిస్థాయి పరిశీలన విహెచ్ ఈ ఎల్ ఇంజనీర్‌లు, రాజకీయ పార్టీల నాయకుల సమాక్షంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరి, జేసి వై సురేందర్ రావు తో కలిసి పరిశీలించారు. హాల్‌లోని 9 టేబుళ్లను వరుస క్రమంలో ఒకొక్కటిగా బ్యాలెట్ యూనిట్ల ఏవీ ఎం మిషన్‌లు వివీవిటిల మొదటి సారి పరిశీలనకు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఫస్ట్ లెవల్ చెకింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగ్గిన సిబ్బంది కంప్యూటరీకరణ దానికి తగినంతా వసతులతో పాటు సిసి కెమెరాల పర్యవేక్షణ, వెలుతురు పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.