అదిలాబాద్

54ఏళ్లలో చేసిందేమీలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్ రూరల్, సెప్టెంబర్ 18: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని, గడిచిన 54 సంవత్సరాల అధికార కాలంలో ఆ పార్టీ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్నారు. మంగళవారం రోజ్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ సతీష్, తాజా మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పురాణం మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తుందన్నారు. ఈమోసాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో టి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకానలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ప్రవేశ పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిసే టి ఆర్ ఎస్ ప్రభుత్వ పథకాల కన్నా రెట్టింపు ఇస్తామని కాంగ్రెస్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీని అధికారంలోకి తీసుక రావాలనేది ప్రజలకు తెలుసన్నారు. కేసీ ఆర్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. ముఖ్యంగా మేదరుల సంక్షేమం కోసం హైదరాబాద్‌లో ఒక ఎకరం భూమిని కేటాయించడంతోపాటు, రూ. కోటి మంజూరీ చేయడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంలో పది గుంటల భూమి కేటాయించామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బానిసలుగా మారి తెలంగాణకు అన్యాయం తలపెడుతున్నారని సతీష్ మండి పడ్డారు.
మన రాష్ట్రంలో మన చేతుల్లో ఉండాలంటే టిఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెరాస మల్లీ అధికారంలోకి వస్తే 50 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ. 2వేల పింఛను ఇస్తామని, షాదీముబాకర్, కళ్యాణ లక్ష్మి పకడ్బందీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులకు అభివృధ్ది కనిపంచక పోతే ప్రభుత్వం చేపట్టిన కంటి పరీక్షా శిబిరాల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. తాజామాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం నాలుగు సంవత్సరాల కాలంలో పని చేసినట్లు తెలిపారు. మరోసారి గెలిపిస్తే నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెలతానని స్పష్టం చేశారు.

కుల వృత్తులకు పూర్వవైభవం
- మాజీ ఎమ్మెల్యే, మంత్రి రామన్న
ఆదిలాబాద్ టౌన్,సెప్టెంబర్ 18: అంతరించిపోతున్న కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకవస్తామని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసి భవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోజు రోజుకు అంతరించిపోతున్న కులవృత్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ ప్రభుత్వ నాలుగున్నరేళ్ళ పాలనలో కుల వృత్తుల వారికి రాయితీపై రుణాలు అందించేందుకు నిధులు సైతం కేటాయించడం జరిగిందన్నారు. గత పాలకులు కులవృత్తుల సంక్షేమాన్ని మర్చిపోవడం వల్లే నేడు వారి జీవనోపాధి కష్టతరంగా మారిందన్నారు. ఆధునిక యంత్రాలను రాయితీపై అందజేసి వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా కృషి చేస్తున్నామని అన్నారు. గొల్ల కుర్మలకు రాయితీ కింద గొర్రెలను అందజేసి ఆర్థికంగా అభివృద్దిచేశామని, దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ది తెలంగాణ రాష్ట్రంలో జరిగిందన్నారు. రాష్ట్ర రాజధానిలో అన్ని కులాలకు సంఘ భవనాల నిర్మాణం కోసం నిధులతో పాటు స్థలాలను కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కెసి ఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం రాయితీ రుణాల కోసం ఎంపికైన లబ్దిదారులకు మంత్రి చెక్కులు అందజేశారు. అదే విధంగా బీసి భవన్‌లో పూసల సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మంత్రిని సంఘం నాయకులు శాలువ, పూలమాలలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మనీషా, ఐసిడిఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, బీసి సంక్షేమ శాఖ అధికారి ఆశన్నతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు సిరాజ్ ఖాద్రి, ఖయ్యూం, మమత, స్వరూప రాణి, మేదరి సంఘం నాయకులు దినేష్, కిషన్, ఆశన్న, గణేష్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.