అదిలాబాద్

టీఆర్‌ఎస్ ప్రచారహోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,సెప్టెంబర్ 18: ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల్లో ఉత్తేజాన్ని పెంచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మిగితా రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తికాకముందే టీఆర్‌ఎస్ దూకుడు పెంచుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు పావులు కదుపుతోంది. సోమవారం ఆదిలాబాద్‌లో మంత్రి జోగురామన్న పట్టణంలో భారీ ఎత్తున మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించి గులాబి శ్రేణుల్లో జోష్ పెంచగా అదే రోజు మావల మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన రామన్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అటు నిర్మల్ నియోజకవర్గంలోనూ అపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రచారానికి పదునుపెడుతూ నాలుగున్నరేళ్ల పాలనలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను వల్లెవేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలోని సారంగపూర్ మండలం తాండ్రా, అలూర్, ప్రతాప్‌నగర్, దిలావర్‌పూర్ మండలం కాల్వ గ్రామాల్లో పర్యటించి భారీ ఎత్తున కార్యకర్తలను పార్టీలో చేర్చుకున్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి పూసగూర్చినట్లు ఓటర్లకు వివరించారు. మంగళవారం మంత్రి జోగురామన్న సైతం జైనథ్ మండల కేంద్రంలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎంపి నగేష్‌తో కలిసి మోటారుబైక్ ర్యాలీలో పాలుపంచుకున్నారు. ఈ సంధర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ ప్రజలను మోసగించడంలో కాంగ్రెస్, బిజెపిని మించిన పార్టీలు దేశంలో లేవని, ఈ ఎన్నికల తర్వాత ఆ పార్టీల అడ్రస్ గల్లంతుకావడం ఖాయమని అన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ అందించి రైతు ప్రభుత్వంగా టీఆర్‌ఎస్ పేరుతెచ్చుకుందని వివరించారు. అనంతరం బహిరంగ సభలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోసారి అధికారం కట్టబెడితే జైనథ్ మండలాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాని హామీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ దూకుడు పెంచుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను పరిశీలించి కొత్త ఓటర్ల నమోదుపై దృష్టిసారించిన నాయకులు మంత్రి రామన్న సూచన మేరకు గ్రామ, వార్డుస్థాయిలో కమిటీలు నియమించారు. ఒక్కో మున్సిపల్ వార్డులో మైనార్టీసెల్, మహిళాసెల్, యూత్, ఎస్సీ, ఎస్టీ, బీసి, విశ్రాంత ఉద్యోగుల కమిటీలు ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలుసుకొని పార్టీ గురించి వివరించేలా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే ఐదు వార్డులకు ఒక నాయకుడికి బాధ్యతలు అప్పజెప్పారు. ప్రతి ఓటరును ప్రత్యేకంగా కలిసేలా టీ ఆర్ ఎస్ వ్యూహం రూపొందించడంతో పాటు మండల, పట్టణ, వార్డుస్థాయి సమావేశాలకు షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే నాలుగేళ్ళలో పార్టీ సమావేశాలపై ఊసెత్తని నేతలు ఎన్నికల సమయంలో సమావేశాలు పెట్టడంపై సీనియర్లు గుర్రుమంటున్నారు. మరోవైపు వందమంది కార్యకర్తలకు ఒక నాయకున్ని నియమించి ఎన్నికల బాధ్యతలను అప్పజెబుతున్నారు. ఈనెల 26, 27 తేదీల్లో సిఎం బహిరంగ సభ జిల్లాలో ఉండే అవకాశం ఉందని, లక్ష మంది జనాన్ని సమీకరించే లక్ష్యంగా ఇప్పటి నుండే టీఆర్‌ఎస్ అన్ని మండలాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గ్రామాల్లో సైతం ర్యాలీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనా టీఆర్‌ఎస్ మాత్రం అన్ని పార్టీలకంటే ముందుగా ప్రచారంలో దూకుడు పెంచడంతో కాంగ్రెస్, బిజెపి, వామపక్ష పార్టీల్లో మాత్రం స్తబ్ధత నెలకొంది.

సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి
-ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
బోథ్ రూరల్,సెప్టెంబర్ 18: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ది పథకాలే ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపిస్తాయని తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బోథ్ మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయినగర్ నుండి మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫ్రెండ్స్‌క్లబ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభకు మాజీ ఎమ్మెల్యే బాపురావు హాజరయ్యారు. అనంతరం రాథోడ్ బాపురావు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది చేశామని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మరో స్వాతంత్య్ర ఉద్యమంగా చేపట్టిన కెసిఆర్ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని అన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, దళిత బస్తీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వాల వివక్ష కారణంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడి పోయిందని, కాని టీ ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక అభివృద్దిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిందన్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం టీ ఆర్ ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.