అదిలాబాద్

విపక్షాల అడ్రస్ గల్లంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు భవిష్యత్ లేదని సి ఎం కేసీ ఆర్ చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో టీ ఆర్ ఎస్‌కు ప్రజల మద్దతు రోజు రోజుకు పెరుగుతుందని రాష్ట్ర ఆపద్ధర్మ గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ నియోజకవర్గంలోని సారంగాపూఱ్ మండలం తాండ్ర, ఆలూర్, ప్రతాప్‌నగర్, దిలావర్‌పూర్ మండలం కాల్వ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున టీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి అల్లోల కండువాకప్పి టీ ఆర్ ఎస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వమూ అమలుచేయని పథకాలు సి ఎం కేసీ ఆర్ చేస్తున్నారన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతిపక్షాలకు భయం పట్టుకుందన్నారు. 60 ఏళ్ల కాలంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేని నాయకలు ప్రస్తుతం సి ఎం కేసీ ఆర్ అమలుచేస్తున్న పథకాలు చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీ ఆర్ ఎస్‌లో పెద్ద ఎత్తున చేరుతున్నారని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అన్ని విధాల అభివృద్ది చేసుకుని బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగాలంటే మళ్లీ టీ ఆర్ ఎస్‌కే పట్టం కట్టాలని కోరారు.

శాంతియుతంగా నిమజ్జనం
-గణేష్ ఉత్సవ సమితి సమావేశంలో మంత్రి ఐకేరెడ్డి
నిర్మల్, సెప్టెంబర్ 18: వినాయక నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట్ర ఆపద్ధర్మ గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని ఆర్‌కె కనె్వన్షన్ హాల్‌లో గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటుచేసిన సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిమజ్జనం సజావుగా పూర్తయ్యే విధంగా చూసుకోవాలన్నారు. అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధితశాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. శోభయాత్ర వెళ్లే రహదారులకు అవసరమైన మరమ్మత్తులు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట బారీకేడ్లను, మంచినీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, నిమజ్జనం పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన..
రైతుల దరిచేర్చాలి
-కలెక్టర్ దివ్య దేవరాజన్
ఆదిలాబాద్ మున్సిపాలిటీ,సెప్టెంబర్ 18: ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన ద్వారా రైతులకు అందే పరిహారంపై పూర్తి అవగాహన పెంపొందించుకునేందుకే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ దివ్యదేవరాజన్ తెలిపారు. కలెక్టర్ కాన్ఫరెన్స్‌హాల్‌లో మంగళవారం జరిగిన శిక్షణ శిబిరంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన పథకం కింద నమోదైన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో క్రోడికరించాలని అన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 269 యూనిట్లు, 1124 ప్రయోగాలు ఉన్నాయని అన్నారు. ఈ సంధర్భంగా ఏఈవోలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ బీమా ద్వారా రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయని, గ్రామాల్లో అవగాహన కల్పించి ఏలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అన్నారు. ఎప్పటికప్పుడు రైతుల సమాచారాన్ని కంప్యూటర్‌లో పొందుపర్చాలని సూచించారు.