అదిలాబాద్

అర్హులైన యువత ఓటరుగా నమోదుచేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, సెప్టెంబర్ 20: 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటర్ల జాబితాలో బాధ్యతగా తమపేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఎన్నికల సహాయ కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు ఫారంలో ఎలా నింపాలి తదితర విషయాల కోసం కలెక్టరేట్‌లో ఎన్నికల సహాయకేంద్రం ఏర్పాటుచేసినట్లు 08734241422కు ఫోన్‌చేసి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 10 నుండి 19 వరకు 12822 ఓటర్లుగా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఓటరు నమోదుకు ఈనెల 25వ తేది చివరని, అర్హులైన ప్రతీ ఒక్కరు తమ ఇంటి సమీపంలోని పోలింగ్ స్టేషన్‌లోగాని, బీఎల్‌వోకు గాని ఫారం-6 నింపి దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్‌లైన్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉందని, ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకుని రానున్న శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రమేష్ రాథోడ్, ఏవో కరీం, డీపీ ఆర్‌వో అబ్దుల్ కలీం తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్
బెల్లంపల్లి, సెప్టెంబర్ 20: 22వ తేదీన వినాయకుడిని నిమజ్జనం చేసే ఏర్పాట్లను బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మునిమంద స్వరూప రమేష్‌లు, వైస్ చైర్మన్ నూనెటి సత్యనారాయణ, మున్సిపల్ కమీషనర్ గోధుమల రాజ్, ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలోని పోచమ్మ గుడి చెరువు వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలోని 34 వార్డులలోని శోభ యాత్రగా తీసుకొచ్చే వినాయకులను నిమజ్జనం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అదికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని కమీషనర్‌కు సూచించారు. అంతేకాకుండా నిమజ్జన ఏర్పాట్లను సింగరేణి రెస్య్కూ టీం సిబ్బంది కూడా నిమజ్జన ఏర్పాట్లకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిపేలా అన్ని చర్యలు తీసుకోవాలని కమీషనర్ రాజుకు సూచించారు. చైర్ పర్సన్ వెంట కౌన్సిలర్‌లు ఎస్‌కే యూసుఫ్, రాజు లాల్ యాదవ్, సముద్రాల శ్రీనివాస్, నాయకులు రాజేందర్, కన్నయ్య సింగ్, అజయ్, ఈఈ సందీప్, తదితరులు ఉన్నారు.

ప్రణయ్‌ను హత్య చేసిన నిందుతులను కఠినంగా శిక్షించాలి
బెల్లంపల్లి, సెప్టెంబర్ 20: నల్గొండ జిల్లా మిర్యాల గూడలో ప్రేమ వివాహాం చేసుకున్న ప్రణయ్‌ను అతి దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండా మల్లేష్ , సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మిర్యాల గూడలో అమృత కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ దారుణ హత్యలో ప్రధాన నిందితుడు అయిన అమృత తండ్రి మారుతీ రావు, ఆస్గర్ ఆలీ, అబ్దుల్ బారీలను ఉరి తీయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. హత్య కేసులో ఉన్న దుండగులను ఇతర నాయకులపై సిబిఐ విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని రాజకీయ ఒత్తిడిలకు పోలీసులు లొంగ కూడదు అని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై రాష్ట్రం అంతా అన్ని వర్గాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తుంటే అపద్దర్మ ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రులు కేటిఆర్, హారీష్ రావులు స్పందించకపోవడం దారుణం అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. వారి వెంట రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బాస్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్ల వెంకట్ రెడ్డి, జిల్లా సమితి సభ్యులు తదితరులు ఉన్నారు.