అదిలాబాద్

అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, సెప్టెంబర్ 20: రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ మున్సిపాలిటి సమావేశ మందిరంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మీదులకు ఆర్థిక చేయూత పథకం కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిర్వహించిన చెక్కుల పంపిణీలో కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక వనరులులేని సమీదులకు నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద ఒక్కొక్క నియోజకవర్గానికి రూ. లక్షల చొప్పున 4 సంవత్సరాల నుండి మంజూరు చేస్తుందన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని 31 మసీదులకు, ముధోల్ నియోజకవర్గంలో 30, ఖానాపూర్ నియోజకవర్గంలో 25 మసీదులకు నిర్వహణ ఖర్చులు కింద ఒక్కొక్క మసీదుకు 17440 రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిర్మల్ పట్టణానికి నలుమూలల రహదారులు, డివైడర్లు, సెంట్రల్‌లైటింగ్, రోడ్ల నిర్మాణానికి రూ.51 కోట్లతో అభివృద్ది చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నిర్మల్ పట్టణంలో ప్రతీ వార్డులో 75 లక్షల నుండి ఒక కోటి రూపాయల విలువ గల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 40 కోట్లతో ఐదు ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం పనులు చేపట్టినట్లు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి, వైస్ ఛైర్మెన్ అజింబిన్‌యాహియా, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మెన్ ధర్మాజిగారి రాజేంధర్, కౌన్సిలర్లు రఫి అహ్మద్ ఖురేషీ, ముజాహిద్, నర్సయ్య, అన్వర్, ఉస్మాన్, నాయకులు ముడుసు సత్యనారాయణ, యూనుష్ అహ్మద్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కిషన్, అతిక్ అహ్మద్, బషీర్‌ఖాన్ బహర్దర్, కో ఆప్షన్ మెంబర్, మాజీ వైస్ చైర్మెన్ వాజిద్ అహ్మద్‌ఖాన్ తదితరలు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయండి
* జేసీ భాస్కర్‌రావు
నిర్మల్, సెప్టెంబర్ 20: ఖరీఫ్-2018 ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.్భస్కర్‌రావు అధకారులను ఆదేశించారు. గురువారం నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో పౌరసరఫరాల, వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూశాఖ అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జిల్లాలో 1.20 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సాగు అంచనా ఉందని దాదాపు 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొనివచ్చే అవకాశం ఉన్నందున దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 125 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని పీ ఎసీ ఎస్ ఆద్వర్యంలో 55, ఐకేపీ 33, డీసీ ఎం ఎస్ 37 కేంద్రాలను ఏర్పాటుచేయాలన్నారు. ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర గ్రేడ్- ఎ రకానికి రూ.1770లు, కామన్ రకానికి రూ.1750 కల్పిస్తుందని, ఈ విషయం రైతులకు వ్యవసాయశాఖ ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో తేమ కొలుచు యంత్రాలు, తూకంవేసే యంత్రాలు, ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు, టార్పాలిన్‌లు సరిపడే విధంగా సిద్దంగా అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్‌శాఖను ఆదేశించారు. ప్రతీ ఒకనుగోలు కేంద్రంలో రైతులకు తాగునీరు, టెంట్లు ఏర్పాటుచేయాలని ధాన్యం అమ్మడానికి వచ్చిన రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు వివరాల గురించి ఒక కంట్రోల్ రూంను ఏర్పాటుచేయాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యంగా కలుగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్‌కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి సూర్యచందర్‌రాజు, వ్యవసాయశాఖ కోటేశ్వర్‌రావు, డి ఎం పౌరసరఫరాల శ్రీకళ తదితరులు పాల్గొన్నారు.