అదిలాబాద్

సిట్టింగ్‌ల సీన్ మారనుందా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, సెప్టెంబర్ 20: టి ఆర్ ఎస్ అదిష్టానం జిల్లాలో మళ్లీ సిట్టింగ్‌లకే సీట్లు కేటాయించడంపై పలు చోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేసి ఆర్, టి ఆర్ ఎస్ అధిష్టానం ఇప్పటి వరకు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా చేయించిన సర్వేలో కనీస మార్కులు పోందని వారికి కూడా సీట్లు కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల విశ్వసనీయత పోందలేకపోయ్యారని భూకబ్జాలకు పాల్పడిన్నారని అనుచరుల ఆగడాలు మితి మీరి పోయ్యాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్‌లకే మళ్లీ సీట్లు కేటాయించడంపై వ్యతిరేకిస్తు ఇప్పటికే టి ఆర్ ఎస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌లకు బి ఫారం లు అందుతాయో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చివరి క్షణంలోను వీళ్ల సీట్లు గల్లంతు అయ్యే ప్రమాదం ఉందనే చర్చలు సాగుతున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కు టికేట్ ఇవ్వడంతో పలువురు నాయకుల మాజీ మంత్రి కేటి ఆర్ కు సమస్యలను విన్నవించారు. నాలుగున్నర సంవత్సరాలలో మంచిర్యాల పట్టణంలో ఎన్నో భూకబ్జాలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పక్కనే పెట్టుకోని కొనసాగారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా మంచిర్యాల మున్సిపాలిటీ ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో జరగలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. నియోజక వర్గంలోని దండేపల్లి, లక్సెట్టిపేట, నస్పూర్ మండలాల్లో కూడా అంతంతా మాత్రానే అభివృద్ది చేశారని, ప్రజా సమస్యలను పట్టించుకోలేదని , ఇలాంటి నాయకుడికి మళ్లీ టికేట్ ఇస్తే నియోజక వర్గం వెనుకబడి పోతుందనే ఉద్దేశ్యంతో టి ఆర్ ఎస్ పార్టీలోనే ఒక వర్గం అధిష్టానానికి విన్నవించారు. అదే విధంగా బెల్లంపల్లి నియోజక వర్గంలో ఆది నుంచి భూకబ్జాలకు పాల్పడుతున్నారనే తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జాల విషయంలో నెనె్నల మండల కేంద్రానికి చెందిన ఓ టిడిపి నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనాటి నుండి ఇప్పటి వరకు అదే తంతూ కొనసాగుతుంది. భూ కబ్జాదారునికి ఏ విధంగా మళ్లీ సీటు ఇస్తారనే అధిష్టానం పై కొంత మంది నాయకులు గుర్రు మంటున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో చైర్మన్‌పై ఆవిశ్వాసం పెట్టగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సునీత రాణి అయిన నెగ్గించుకోవడంలో విఫలమయ్యారు. మాజీ ఎంపి వివేక్ అనుచరుడు మునిమంద రమేష్ సతీమణి స్వరూప చైర్మన్ పదవీని కైవసం చేసుకోవడం జరిగింది. వీరి మధ్య పోరు కొనసాగుతునే ఉంది. ఈ ఎన్నికలలో తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు, మాజీ ఎంపి వివేక్ అనుచర వర్గం మద్దతు ఇస్తారో లేదో అన్న చర్చనీయాంశంగా ఉంది. చెన్నూర్ నియోజక వర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు టికేట్ ఇవ్వకుండా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్‌కు టికేట్ కేటాయించడంతో ఆ నియోజక వర్గంలో నిరసనలు వెల్లువెత్తడమే కాక ఓ నాయకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నంకు పాల్పడగా, 16 మంది గాయపడ్డారు. పెట్రోల్ పోసుకున్న గట్టయ్య మృతి చెందాడు. మృతుని అంత్యక్రియలకు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, టి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్‌లు హాజరు కాకపోవడంతో కొంత మంది నాయకులు అధిష్టానంపై మండి పడుతున్నారు. టికేట్ కోసం అభిమానులు ఆత్మహత్య చేసుకుంటే వారి అంత్యక్రియలకు హాజరుకాకపోవడంపై పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఒక వర్గం భూ కబ్జా దారులకు కొమ్ము కాయడంతో అధిష్టానం అతనికి టికేట్ ఇవ్వకుండా స్థానికేతరుడు అయిన బాల్క సుమన్‌కు టికేట్ ఇవ్వడం పట్ల ఆసహానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ స్థానికులకే టికేట్ ఇచ్చి టి ఆర్ ఎస్ పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసే నాయకుడికే టికేట్ ఇవ్వాలని ప్రజలు అనుకుంటున్నారు. ఎన్నికల రాకముందే టి ఆర్ ఎస్ అధిష్టానం సిట్టింగ్‌లకు సీట్లు కేటాయించడంతో ఆసంతృప్తి వాదులు నిరసన గళాన్ని ఎత్తుకున్నారు. సీట్లు మార్చాలనే అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. టి ఆర్ ఎస్ అధిష్టానం ఎన్నికల ముందు సిట్టింగ్‌ల సీట్లు మార్చుతారా....? లేదా సిట్టింగ్‌లనే కొనసాగిస్తారా అనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతు అభివృద్ధి
* జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి
మంచిర్యాల, సెప్టెంబర్ 20: సహాకార సంఘాల ద్వారా రైతులు సేంద్రియ వ్యవసాయం కొనసాగించి, సాగు ఖర్చులు తగ్గించి వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించి రైతులు అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరి అన్నారు. గురువారం హజీపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో భారతీయ రైతు సహాకార సంఘం ఎరువుల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రైతులు సహాకార సంఘాలు ఏర్పాటు చేసుకొని స్వంత నిధులతో స్వయం సిద్దంగా ఎదగాలని సహాకార సంఘాల ద్వారా సేంద్రియ వ్యవసాయం చేస్తూ వ్యవసాయ ఖర్చులు తగ్గించి అధిక దిగుబడి పోంది లాభాలు సాధించాలని అన్నారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా అన్నదాతలు ప్రాణదాతలుగా మారాలని అన్నారు. సహాకార సంఘాలు వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక దృక్పథంతో పని చేయాలన్నారు. సహాకార సంఘాలతో సొంత పరపత్తి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ఇలాంటి సంఘాలకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని భవిష్యత్‌లో ఎరువులతో పాటు విత్తనాలు, ధాన్య సేకరణ వ్యవసాయ పనిముట్లు రైతులకు అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాకార అధికారి బి సంజీవ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, సహాకార ఏరియా అధికారి రవీందర్ రావు, న్యాయ సలహాదారులు నైనాల గోవర్థన్, సంఘం అధ్యక్షులు తిరుపతి, గ్రామ రైతులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.