అదిలాబాద్

జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 20: ఆదిలాబాద్ జిల్లాలో పాడి పరిశ్రమను అభివృద్ది పర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, రైతులు పాడి పరిశ్రమ వైపు దృష్టిసారించి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాడి పరిశ్రమల కేంద్రం ఆవరణలో రూ.6కోట్ల 62లక్షలతో నిర్మించతలపెట్టిన మిల్క్ చిల్లింగ్ కేంద్ర భవన నిర్మాణ పనులకు డెయిరీ కార్పోరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డి, ఎంపి నగేష్‌లతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు రైతులు పాడిపరిశ్రమ వైపు దృష్టిసారించినట్లయితే ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు. ఆ దిశగా ప్రభుత్వం సైతం పాడి సంపదను పెంచేందుకు ఎంతగానో కృషి చేస్తుందని, ఇప్పటికే రాయితీపై గేదెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా లీటరు పాలపై రూ.4 ప్రభుత్వం బోనస్‌గా చెల్లిస్తుందన్నారు. పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమను ఉపాధి పర్చేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 84లక్షల గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. రైతులకు సాగునీరందించేందుకు భారీ ఎత్తున ప్రాజెక్టుల రూపకల్పనకు శ్రీకారం చుట్టామని, ఇందులో భాగంగా చెనాకకోర్ట బ్యారేజీ పనులు త్వరలో పూర్తికానున్నాయని, దీంతో తాంసి, జైనథ్, ఆదిలాబాద్ మండలాల రైతులకు సాగునీరు అందనుందని అన్నారు. కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి సైతం ప్రభుత్వం నిధులు మంజూరి చేసిందని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుచేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్ర డెయిరీ కార్పోరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రాని పాడిపరిశ్రమలో ముందుండేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం పెద్దఎత్తున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అర్హులైన రైతులందరూ రాయితీ గేదెలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మెన్ దామోదర్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ రంగినేని మనీషా, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె రాజన్న, రైసస జిల్లా అధ్యక్షులు అడ్డి బోజారెడ్డి, కస్తాల ప్రేమల, కౌన్సిలర్ దోని జ్యోతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ గూటికి రాథోడ్ రమేష్
* నేడు కుంతియా సమక్షంలో పార్టీలో చేరిక
ఆదిలాబాద్, సెప్టెంబర్ 20: మాజీ పార్లమెంట్ సభ్యుడు, టీఆర్‌ఎస్ నాయకుడు రాథోడ్ రమేష్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నాయకునిగా ముద్రపడ్డ రాథోడ్ రమేష్ ఏడాది క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం విధితమే. ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రాథోడ్ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇటీవల ఉట్నూరులో ర్యాలీ నిర్వహించి రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. అయితే టీఆర్‌ఎస్ అధినేత కెసి ఆర్ నుండి ఏలాంటి హామీ రాకపోవడం, ఖానాపూర్ టికెట్ తిరిగి రేఖానాయక్‌కు కేటాయించడంతో విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో రెండు మూడు సార్లు మంతనాలు సాగించిన అనంతరం జిల్లా కాంగ్రెస్ సీనియర్లు పార్టీలో చేరికకు అభ్యంతరం తెలుపకపోవడంతో శుక్రవారం కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఎంచుకున్నారు. గాంధీభవన్‌లో జరిగే కాంగ్రెస్ పార్టీలో చేరిక సంధర్భంగా జిల్లా నుండి ముఖ్యంగా ఉట్నూరు ఏజెన్సీ నుండి వేలాది మంది కార్యకర్తలు తరలివెళ్ళనున్నారు. ఆయనతో పాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, పార్టీ సీనియర్లు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఖానాపూర్ స్థానంలో రమేష్ రాథోడ్‌కు కాంగ్రెస్ బెర్త్ ఖరారు కావడంతోనే పార్టీలో చేరుతున్నట్లు రాథోడ్ రమేష్ ఆంధ్రభూమికి తెలిపారు. కాగా రమేష్ రాథోడ్ తెలుగుదేశం పార్టీ నుండి 1999-2004ఎమ్మెల్యేగా, 2008-09 ఆదిలాబాద్ జడ్పీ చైర్మెన్‌గా, 2009-2014 వరకు పార్లమెంట్ సభ్యునిగా కీలక పదవుల్లో కొనసాగారు. త్వరలోనే ఉట్నూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రచారాన్ని ప్రారంభిస్తానని రమేష్ రాథోడ్ వివరించారు.