అదిలాబాద్

గెలిపిస్తే తెలంగాణ భవన్‌కే రావాలా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, సెప్టెంబర్ 22: చెన్నూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపి బాల్క సుమన్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల కార్యాచరణ రూపొందించడం వివాదస్పదంగా మారింది. ఎన్నికల్లో గెలిపిస్తే వివిధ సమస్యలపై తాము తెలంగాణ భవన్‌కే రావాల్సి ఉంటుందా అని చెన్నూర్ వాసులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నియోజక వర్గం అయిన చెన్నూర్‌లో ఏర్పాటు చేయకుండా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంపై మండిపడుతున్నారు. తాజా మాజీ విప్ నల్లాల ఓదెలు అనుచరుడు రేగుంట గట్టయ్య ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో చెన్నూర్ టిఆర్‌ఎస్‌లో నిస్తేజం నెలకొంది. గట్టయ్య ఆత్మహత్య అనంతరం పరిస్థితులు మారిపోవడంతో నేతలు ప్రచారానికి వెళ్లేందుకు జంకుతున్నారు. ఎంపి బాల్క సుమన్ ఓటమితో గట్టయ్యకు ఘనంగా నివాళులు అర్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి చెన్నూర్ పరిస్థితులపై విశే్లషించారు. అయితే ప్రచారానికి పరిస్థితులు అనుకూలంగాలేవని చెప్పడంతో కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రచారాన్ని ప్రారంభించిన మొదటిరోజే ఇందారం వద్ద ఘటన చోటుచేసుకోవడం గట్టయ్య ఆత్మహత్య చేసుకోవడం టిఆర్‌ఎస్ వర్గాలలో కలకలం రేపింది. సంఘటన అనంతరం తాజా మాజీ విప్ హైదరాబాద్‌కు వెళ్లి టీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్‌తో చర్చల అనంతరం మెత్తపడటంతో కార్యకర్తలు మండిపడుతున్నారు. నల్లాల ఓదెలుకు టికెట్ ఇవ్వాలని గట్టయ్య ఆత్మబలిదానం చేసుకోగా ఓదెలు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయకుండా మళ్లీ టిఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తాననడం కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. చెన్నూర్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి ప్రచారం చేపట్టేందుకు జంకుతుండగా ప్రజలు సైతం తీవ్ర వ్యతిరేకతను చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నూర్ నియోజక వర్గం నుండి టి ఆర్ ఎస్ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకలా మారింది.

నిర్మల్ పట్టణంలో పోలీసుల కవాతు
నిర్మల్, సెప్టెంబర్ 22: నిర్మల్ పట్టణంలో ముందస్తుగా పోలీసు అధికారులు భారీ భద్రత చర్యలు చేపట్టారు. పట్టణంలో ఆదివారం వినాయక నిమజ్జన శోభాయాత్ర నిర్వహించుకోనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో ముందు జాగ్రత్తగా పట్టణ ప్రధాన రహదారులు, వీధుల్లోని అంతర్గత మార్గాల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో శోభాయాత్ర సందర్భంగా భారీ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏ ఎస్పీ, డీ ఎస్పీలు, సి ఐలు, ఎస్సైలు, ప్రత్యేక రక్షణ దళాలు, హెడ్‌కానిస్టేబుల్, పోలీసులు, హోంగార్డులు, వజ్ర వాహనం, బాంబు నిర్వీర్య దళం, జాగిలాలను భద్రత కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. పట్టణానికి వచ్చిపోయే నాలుగు మార్గాలలో తనిఖీ కేంధ్రాలు, ప్రదాన కూడళ్లు, రహదారులు, ప్రార్థనా మందిరాలు, ఆలయాల వద్ద పోలీసు పికెటింగ్‌లు పెట్టామన్నారు. వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తామన్నారు. పట్టణంలోని ఆయా చోట్ల ఏర్పాటుచేసిన 60 నిఘా కెమెరాలను స్థానిక నిర్మల్ గ్రామీణ పోలీస్‌స్టేషన్ కార్యాలయానికి అనుసంధానించామని తెలిపారు. వీటికి తోడు 10 వీడియో కెమెరాలతో మొబైల్ బృంధాలు రికార్డింగ్ చేస్తాయని పేర్కొన్నారు. ప్రజలు పండుగను ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని విజ్ఞప్తిచేశారు. కొత్త వ్యక్తులు, అనుమానితుల గురించి ఏవైన సందేహాలుంటే తమను సంప్రదించాలని సూచించారు. పుకార్లు నమ్మవద్దని సంయమనం పాటించాలని కోరారు.

మొదటి విడత ఈవిఎంల పరిశీలన పూర్తి
* కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు
* పార్టీల నేతలతో కలిసి ఇవిఎంల పరిశీలన
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 22: జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటి గోదాంలో నిలువ చేసిన ఈవిఎంల పనితీరుపై మొదటి దశ పరిశీలన పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తెలిపారు. శనివారం ఆయా పార్టీల నాయకులతో , ఇంజనీర్లతో కలిసి ఆయన ఈవిఎంల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వారం రోజులుగా బెంగుళూరు నుండి వచ్చిన బెల్ కంపెనీ ఇంజనీర్లతో కలిసి ఈ వి ఎంలు, వివి పాట్స్ ల పనితీరును పరిశీలించడం జరిగిందన్నారు. మొదటి దశ పరిశీలన పూర్తి అయన నేపథ్యంలో ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మాక్ పోల్ నిర్వహించారు. కొత్త మిషన్ల ద్వారా ప్రతి గుర్తు కనిపించే విధంగా యంత్రాలను తయారు చేయడం జరిగిందని అదే విధంగా ఓటు వేసిన వారికి తాము ఏ గుర్తుకు ఓటు వేసామన్నది కనిపించడం జరుగుతుందన్నారు. ఈ వివి పాట్స్ ఏర్పాటు పట్ల ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త పాలనాధికారి రాంబాబు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.