అదిలాబాద్

నూతన ఆలయాలకు విరివిగా నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, సెప్టెంబర్ 22: రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరుచేసిందని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని చింతకుంటవాడ హన్మాన్ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన గణనాథున్ని మంత్రి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయల నిధులను కేటాయించారని తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో పాత ఆలయాల అభివృద్దికి నిధులు కేటాయించడంతోపాటు నూతన ఆలయాల నిర్మాణానికి సైతం కోట్లాది రూపాయల నిధులు మంజూరుచేశామన్నారు. చింతకుంట వాడలోని హన్మాన్ ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.25 లక్షలు మంజూరుచేశామని, కేవలం మూడు నెలల్లోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసిన స్పెషల్ క్లాస్‌వన్ కాంట్రాక్టర్ లక్కడి జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రి అభినందించి శాలువతో సత్కరించారు. గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనుండడంతో ఎలాంటి అపశృతులు దొర్లకుండా శాంతి సామరస్యాలతో శోభాయాత్రను నిర్వహించుకోవాలని గణేష్ మండప నిర్వాహకులకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. అనంతరం లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ అన్నదానంలో వందలాది మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు గండ్రత్ ఈశ్వర్, స్థానిక నాయకులు గండ్రత్ రమణ, పోగుల రాజేంధర్, అడప పోశెట్టి, జోగు భూషణ్, కందుల పండరి, కోల శంకర్, ముక్క శేఖర్, అడప చిన్నయ్య, కందుల శేఖర్, ప్రవీన్‌రెడ్డి, గండ్రత్ రాజు, గండ్రత్ రమేష్, సుంకరి శ్రీను, బద్రి శేఖర్, అడప గణేష్, డిఎస్ రాజేశ్వర్, పంతిక యువరాజ్, కుంట భూమన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సమగ్ర ఓటరు జాబితాకు అందరూ సహకరించాలి
* ఎలక్టోరల్ అబ్జర్వర్ చిరంజీవులు
నిర్మల్, సెప్టెంబర్ 22: సమగ్ర ఓటరు జాబితాలకు అందరూ సహకరించాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ చిరంజీవులు అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎలక్టోరల్ రోల్, ఓటరు జాబితాలపై అధికారుల, వివిధ రాజకీయ నాయకులతోనిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోల్ అబ్జర్వర్ మాట్లాడుతూ జనవరి 1 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఈనెల 25వ తేదీలోగా ఓటరు జాబితాలో పేర్లు నమోదుచేసుకోవాలని అన్నారు. ఓటు హక్కుపై అవగాహణ కలిగించి, ఓటు హక్కు ప్రాముఖ్యతను తమ వంతు బాధ్యతగా ప్రతీ పౌరినికి తెలియజేయాలన్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాలమేరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన త్రపీ ఒక్కరి పేరు ఓటరు జాబతాలో వచ్చే విధంగా అధికారులు కృషిచేయాలని తెలిపారు. అన్ని బూత్‌లెవల్ పోలింగ్ కేంద్రాలలో బీ ఎల్‌వోలు అందుబాటులో ఉంటారని, ఈ కేంద్రాలలో కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, పోలింగ్ కేంధ్రాల మార్పులు, చేర్పులు స్వీకరిస్తారని అన్నారు., ఎవరికైన అభ్యంతరాలుంటే తెలియజేయాలన్నారు. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకుని అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి మాట్లాడుతూ 2018 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదుచేసుకోవాలని అన్నారు. ఈనెల 25 జనవరి అవకాశం ఉందని, అక్టోబర్ 8న తుది జాబితా వెలువడుతుందన్నారు. ప్రతీ పోలింగ్ బూత్‌లో బీ ఎల్‌వోలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేశామన్నారు. ఓటర్ల సందేహాలు నివృత్తి చేయడానికి కలెక్టరేట్‌లో సహాయ కేంధ్రం టోల్‌ఫ్రీ నెంబర్ 08734241422 ఏర్పాటుచేశామన్నారు. ప్రతీ పోలింగ్ బూత్‌లో బీ ఎల్‌వోలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేశామన్నారు. జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాలతో పాటు గ్రామపంచాయతీల్లోని ముఖ్య కూడళ్లలో ఓటు నమోదు ప్రాముఖ్యత బ్యానర్లు ఏర్పాటుచేశామన్నారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలు, సమస్యలు ఏమైన ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు సూచించారు. సమావేశంలో నిర్మల్, భైంసా ఆర్డీవోలు ఫ్రసూనాంభ, రాజు, టీ ఆర్ ఎస్ నాయకులు ముడుసు సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు పోశెట్టి, టీడీపీ నాయకులు గండ్రత్ రమేష్, సిపి ఐ నాయకులు విలాస్, వివిధ పార్టీల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.