అదిలాబాద్

వినాయకా.. వీడ్కోలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 23: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గణేష్ నవరాత్రుల అనంతరం అనంతచతుర్దశిని పురస్కరించుకొని గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఆదివారం కన్నులపండగగా సాగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించిన గణేష్ శోభాయాత్రను తిలకించేందుకు దారి పొడవున భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పట్టణంలోని వినాయక చౌక్ శిశు మందిర్ ప్రాంగణంలో ఆది గణనాథునికి ప్రత్యేక పూజలు, మంగళ హారతులిచ్చి నిమజ్జన శోభాయాత్రను జిల్లా కలెక్టర్ దివ్య, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ప్రారంభించారు. హిందూ సమాజ ఉత్సవ సమితి అధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో తాజా మాజీ మంత్రి జోగు రామన్న, బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు జంగిలి ఆశన్న తదితరులు పాల్గొన్నారు. ఈసంధర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి రామన్న మాట్లాడుతూ జాతి సమైక్యతను ప్రతిబంభించే వినాయక ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, గణనాథున్ని పూజించి వీడ్కోలు పలుకాలని అన్నారు. ప్రతి ఏటా భక్తిశ్రద్దలతో వినాయక ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, భిన్నత్వంలో ఏకత్వంలా ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని అన్నారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో గతంలో ఎస్పీగా పనిచేసిన అనుభవంతోనే తాను పది రోజుల నుండి గణేష్ బందోబస్తుకు ప్రణాళికలు రూపొందించి, ఎప్పటికప్పుడు మత పెద్దలతో శాంతికమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు స్వీకరించడం జరిగిందన్నారు. ముందు జాగ్రతతో పాటు బందోబస్తు వల్లే ప్రశాంత వాతావరణం నెలకొందని, పది రోజుల పాటు జిల్లాలో ఆనందోత్సవాలతో ఉత్సవాలు జరుపుకోవడం పట్ల ఎస్పీ ఆనందం వ్యక్తం చేశారు. శాంతి సామరస్యానికి ప్రతీకగా నిలిచే సార్వజనిక ఉత్సవాలు ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. పోలీసుల సహకారం ఎప్పుడు ప్రజలకు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సారి భారీ అలంకరణలతో గణనాథులను తీర్చిదిద్ది ప్రజలను ఆకట్టుకునే విధంగా మట్టి గణపతులకు ప్రాధాన్యతనిచ్చారని జిల్లా కలెక్టర్ దివ్య అన్నారు. ఆదిలాబాద్‌లోని విద్యుత్ సబ్ స్టేషన్‌కు వెనకవైపు ప్రతిష్టించిన నేత్ర గణేష్ మండలికి మొదటి బహుమతి కింద రూ.25వేల నగదు, కైలాస్‌నగర్‌లోని హనుమాన్ మందిరం వద్ద గల కైలాస్ నగర్ గణేష్ మండలికి ద్వితీయ బహుమతి కింద రూ.10వేలు, చించరవాడ గణేష్ మండలికి తృతీయ బహుమతి కింద రూ.5వేలు ప్రకటించారు. మరో ఏడు గణేష్ మండళ్ళకు కన్సోలేషన్ బహుమతుల కింద రూ.3వేల చొప్పున అందించడం జరుగుతుందని, పర్యావరణం, మట్టికి ప్రాథన్యతనివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

డిఐజీ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన బందోబస్తు
కరీంనగర్ డీఐజి పి ప్రమోద్‌కుమార్ అధ్వర్యంలో ఆదిలాబాద్‌లో ఈసారి భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుండే వివిధ మార్గాల గుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించగా ప్రార్థన స్థలాల వద్ద భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. డిఐజి ప్రమోద్‌కుమార్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పర్యవేక్షణలో 160 గణేష్ మండళ్ళ శోభాయాత్ర కొనసాగింది. సిసి కెమెరాల నిఘాతో బందోబస్తును ఏర్పాటు చేయగా సుమారు 800 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఖానాపూర్, బొక్కలగూడ, వినాయకచౌక్, నేతాజీచౌక్, అశోక్ రోడ్డు గుండా గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్ వరకు వినాయకుల శోభాయాత్ర కన్నుల విందుగా కొనసాగింది. వినాయక మండపాల ముందు చిన్నారుల శాస్ర్తియ నృత్యాలు, మరోవైపు గుస్సాడీ, దింసా నృత్యాలు, యువతీ యువకుల కేరింతల మద్య తీన్మార్ డప్పుల వాయిద్యాలు, బ్యాండ్ మేళాలతో శోభాయాత్ర విశేషకంగా ఆకట్టుకుంది. దారి పొడవున భక్తులు గణేష్ మహారాజ్‌కి జై.. గణపతి బొప్పమోరియా అనే నినాదాలు మిన్నంటాయి. ముస్లీం యువకులు ఏ ఎస్‌కె ఫౌండేషన్ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు, తాగునీటి సరఫరా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా చూసిన భక్తిపారవశ్యం కనిపించింది.