అదిలాబాద్

కాగజ్‌నగర్ ఆర్డీవోగా శివకుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాగజ్‌నగర్, సెప్టెంబర్ 24: కాగజ్‌నగర్ ఆర్డీవోగా శివకుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్)గా విధు లు నిర్వహించిన శివకుమార్ కాగజ్‌నగర్ ఆర్డీవో గా బదిలీపై వచ్చారు. ఈ మేరకు పాత ఆర్డీవో రమేష్ బాబు నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్త ఆర్డీవో మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్లు రామ్మోహన్, రఘునాథ్, లింగమూర్తి తదితరులు ఉన్నారు.