అదిలాబాద్

అర్జీలు స్వీకరించిన ప్రాజెక్టు అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, సెప్టెంబర్ 24: ఐటిడిఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గిరి దర్బార్‌లో ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య పాల్గొని ఆర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సంధర్భంగా గతంలో వచ్చిన ఆర్జీల్లో ఎంత వరకు పురోగతి సాధించారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో వచ్చిన ఆర్జీల్లో ఎన్ని పరిష్కరించారు, మిగితా ఆర్జీల పరిస్థితి ఏమిటని వాకాబు చేశారు. అనంతరం ఇంద్రవెల్లి మండలం మోహన్‌గూడకు చెందిన సిక్రం సోనెరావు ఏదైన ఉద్యోగ అవకాశం కల్పించాలని, నార్నూర్‌కు చెందిన రాథోడ్ తిలక్ ఉపాధి కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. మంచిర్యాలకు చెందిన ఆత్రం రాంబాయి తన కుమారుడు గిరి ఎక్స్‌ప్రెస్ రుణం తీసుకున్నాడని, కాని ఇటీవల ఆనారోగ్యంతో చనిపోయినందున ఆరుణాన్ని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మాన్కాపూర్‌కు చెందిన చంద్రకళ అటవీ హక్కు పత్రాలు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా మంచిర్యాల జిల్లా ఇందన్‌పెల్లికి చెందిన జుగ్నాక లక్ష్మి సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. బేల మండలం చాంద్‌పల్లికి చెందిన మానాజీ గ్రామంలో ఉన్న జీయో టవర్‌ను తొలగించాలని, దంతన్‌పెల్లి గ్రామానికి చెందిన శ్యాంరావు కిరాణ షాప్‌కోసం ఆర్థిక సాయం చేయాలని, సిర్పూర్‌యు గ్రామానికి చెందిన కుమ్ర ధర్మెందర్ నర్సరీలో ఉద్యోగం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సమావేశంలో డిడి చందన, ఆర్డీవో వినోద్, ఎంపిడీవో తిరుమల, జిల్లా వైద్యాధికారి కుమ్ర బాలు తదితరులు పాల్గొన్నారు.