అదిలాబాద్

‘్ఫసల్‌బీమా’ ఇబ్బందులన్నీ బ్యాంకర్లతోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 24: రైతులను ఇబ్బందిపెట్టే విధంగా బ్యాంకర్లు, అధికారులు వ్యవహరిస్తున్నారని, ఫస ల్ బీమా యోజన కింద విడుదలైన డబ్బులను రైతురుణ ఖాతాలో కాకుం డా సేవింగ్ ఆకౌంట్‌లో జమచేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఈమేరకు బిజెపి అధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ దివ్యను కలిసి రైతుల సమస్యలను బిజెపి నేతలు విన్నవించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మాట్లాడుతూ వివిధ గ్రామాలకు చెందిన రైతులకు ఇన్సూరెన్స్ కింద నిధులు మంజూరైతే బ్యాంకర్లు తమ రుణాల పరపతికి సంబంధించి ఖాతాలో వేసుకొని రుణ బకాయిల కింద కోత విధిస్తున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జిల్లాలోనే 3లక్షల 40వేల ఎకరాలకు సంబంధించి 45వేల మంది రైతులకు ఫసల్ బీమా యోజన పథకం వర్తించిందని, దీన్ని దారిమళ్ళించే ప్రయత్నం మానుకోవాలన్నారు. వర్షా లు, వరదలతో లక్షా 40వేల ఎకరాల్లో పంటలు నష్టపోతే ఇంతవరకు సర్వే పూర్తిచేయకపోవడం, పరిహారం విషయంలో ప్రభుత్వం సరైన స్పందన లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతు బంధు కింద జిల్లాలో సుమారు 15వేల మంది రైతులకు ఇంతవరకు చెక్కులు, పాసు పుస్తకాలు ఇవ్వలేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ దివ్య మాట్లాడుతూ త్వరలోనే బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడి ఫసల్ బీమా పరిహారాన్ని రుణ ఖాతాల్లో కాకుండా సేవింగ్ అకౌంట్‌లో జమచేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విలేఖర్లతో శంకర్ మాట్లాడుతూ రైతు సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదని, పరిహారం కోసం రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకివస్తే రూ.2లక్షల రుణమాఫీ అందిస్తామని, బీడు భూములను సాగులోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన రైతులు, బిజెపి నేతలు పాల్గొన్నారు.