అదిలాబాద్

అర్హులకే ఆర్థిక రుణ పరపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 24: వివిధ పథకాలకింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్దిదారులను గుర్తించి కార్పోరేషన్ల ద్వారా రాయితీ రుణాలు అందించాలని కలెక్టర్ దివ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంధర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రుణాల మంజూరులో పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే ప్రారంభించేలా చూడాలని, పరిపాలన అనుమతి పొంది ఉంటేనే వాటిపై దృష్టిసారించాలన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది, అధికారుల వివరాలను నిర్ణీత ఫార్మెట్‌లో పొందుపర్చి నివేదించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, డిఆర్‌వో నటరాజ్, ఆర్డీవో సూర్యనారాయణ, డిఆర్‌డివో పిడి రాజేశ్వర్ రాథోడ్, జడ్పీ సిఈవో జితెందర్ రెడ్డి, ఎల్‌డిఎం ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఓటర్ నమోదును విస్తృతంగా చేపట్టాలి

నిర్మల్, సెప్టెంబర్ 24: జిల్లాలో నేడు ఓటర్ నమోదు కార్యక్రమం విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ సెల్ విభాగంలో జిల్లా ఆధికారులతో ఓటర్ నమోదుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. 25 సెప్టెంబర్ ఓటర్ నమోదుకు చివరి గడువుకావడంతో జిల్లాలోని పలుశాఖల ఆధికారులు ఓటర్ నమోదుపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా 18ఏళ్ళు నిండిని యువతి, యువకులు ఓటర్ జాబితాలో తమపేర్లను నమోదు చేసుకునే విధంగా చూడాలని అదేశించారు. జిల్లాలోని ప్రతి చౌకధరల దుకాణంలో ఓటర్ నమోదు కొరకు ఫాం-6ను అందుబాటులో ఉంచి యువకులు ఓటర్‌గా నమోదు చేసుకునే విధంగా చూడాలని పౌరసరఫరాల ఆధికారిని ఆదేశించారు. ఆధికారులకు ప్రచార సామాగ్రిని, ఫ్లెక్సీలు, అందించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు, డీఆర్‌వో రమేష్ రాథోడ్, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో ప్రసునాంబ, డీఎంఅండ్‌హెచ్‌వో జలపతినాయక్, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సురేష్, డీఎస్‌వో సూర్యచందర్‌రావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ ఆధికారులు, కిషన్, విజయ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.