అదిలాబాద్

హస్తిన చుట్టూ హస్తం రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 24: కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అధిష్ఠానానికి కత్తిమీదిసాములా తయారైంది. ఒక్కో నియోజకవర్గంలో పార్టీ టికెట్ ఆశించే వారి సంఖ్య నానాటికి పెరుగుతుండడంతో పార్టీ టికెట్లు ఎవరికి దక్కుతుందా అన్న అంశం కార్యకర్తలను కలవరపెట్టిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆశావాహులు తుది ప్రయత్నాలు సాగిస్తూనే అధిష్ఠానం ప్రాపకం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రాథోడ్ ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు జిల్లాలో తన రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకునే దిశగా ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్రారంభించారు. టిపిసిసి ఇంచార్జి కుంతియా, రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పలుమార్లు సంప్రదించి టికెట్‌పై పూర్తి భరోసా కల్పించిన పిమ్మటే తన భార్య సుమన్ రాథోడ్, తనయుడు రితేష్ రాథోడ్‌తో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే రమేష్ రాథోడ్ చేరికపై కాంగ్రెస్‌లోని ఒక వర్గం గుర్రుగా ఉండడంపై ఆయన వ్యూహత్మకంగానే అడుగులు వేస్తూ ఢిల్లీలో రాహుల్‌గాంధీ, ఏఐసిసి నాయకులు గులాంనబీ ఆజాద్ మెప్పు పొందేందుకు ఢిల్లీకి బయల్దేరి వెళ్ళారు. పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన అనుభవం నేపథ్యంలో ఢిల్లీ నేతలను సంప్రదించి బిఫాం సంపాదించేలా కసరత్తు సాగిస్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్‌లో ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ నెలకొని ఉంది. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని టిపిసిసి ఇచ్చిన పిలుపుమేరకు ఇది వరకు మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, గండ్రత్ సుజాత, భార్గవ్‌దేశ్‌పాండేలు జాబితాలో ఉండగా తాజాగా, మైనార్టీ నాయకుడు సాజిద్ ఖాన్, యువ న్యాయవాది సంజయ్‌రెడ్డి దరఖాస్తు చేసుకోవడంతో ఐదుగురు అభ్యర్థుల పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోంది. ఇదివరకే ఒకసారి అభ్యర్థుల ఎంపిక, గెలుపు గుర్రాల అంశాలపై సర్వే నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా రెండు రోజుల క్రితం రిసర్వే పేరిట బృందాలు పశ్చిమ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించి, అభ్యర్థుల కూర్పుపై వివరాలు సేకరించి అధిష్ఠానానికి పంపారు. అయితే గండ్రత్ సుజాతకు టికెట్ ఖాయమని ప్రచారం సాగుతుంటే మరోవైపు మాజీమంత్రి రాంచంద్రారెడ్డి ఈసారి బరిలో నిలువడం ఖాయమని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. భార్గవ్ దేశ్‌పాండే కూడా హైకమాండ్ నేతలతో సంప్రదిస్తూనే గట్టిప్రయత్నం సాగిస్తున్నారు. గండ్రత్ సుజాత ఒక్క అడుగు ముందుకేసి వాల్‌పోస్టర్లు, బ్యానర్లతో (మిగతా 3వ పేజీలో)