అదిలాబాద్

అభివృద్ధిని చూసి పట్టం కట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ,అక్టోబర్ 12: మండలంలోని రాంపూర్ గ్రామంలో శుక్రవారం మంత్రి జోగు రామన్న పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామంలో నెలకొల్పిన దుర్గామాత విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రామన్న మాట్లాడారు. అభివృద్దిని చూసి మరోసారి అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సంధర్భంగా గత నాలుగున్నర సంవత్సరాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది పథకాల గురించి వివరించారు. టీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాకుండా మెనిఫెస్టోలో లేని హామీలను సైతం ముఖ్యమంత్రి అమలుపర్చారని గుర్తుచేశారు. గ్రామం నుండి ఆదిలాబాద్‌కు ఆటోలో ప్రయాణిస్తున్న ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని పలకరిస్తూ అప్యాయంగా మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రి వెంట ఐసిడిఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, రైసస చైర్మెన్ అడ్డి బోజారెడ్డి, నాయకులు ఆశమ్మ, సుఖేందర్ తదితరులు పాల్గొన్నారు.