అదిలాబాద్

20న రాహుల్ నేరడిగొండకు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, అక్టోబర్ 12: ఈనెల 20వ తేదీన అఖిల భారత కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు రాహుల్ గాంధీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజక వర్గం నేరడిగొండ గ్రామానికి రానున్నారని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మత్తమారి సూరిబాబు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా బెల్లంపల్లి నియోజక వర్గంలోని నాయకులు, కార్యకర్తలు , మహిళలు, అనుబంధ సంఘాల నాయకులు ఎన్ ఎస్ యూ ఐ , ఓబి సెల్, మైనార్టీ సెల్‌నాయకులు అధిక సంఖ్యలోపాల్గొని రాహుల్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా 26 వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటి ఆధ్వర్యంలో బెల్లంపల్లి కాంట చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ రోడ్డు షో జరుగుతుందని తెలిపారు. ఈ రోడ్డు షో కార్యక్రమానికి ప్రచార కమిటి చైర్మన్ భట్టి విక్రమార్క, స్టార్ కాంప్టెనియన్‌విజయశాంతి, డికే అరుణ, వి హన్మంత రావు, దామోళ్ల రాజనర్సింహా, టిపిసి సి ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ రోడ్డు షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్‌అధ్యక్షులు ఎండి అఫ్జల్, పట్టణ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్,సీనియర్ నాయకులు చిన్న రాజం, గెల్లి జయరాం, బండి రాము, నల్ల చక్రపాణి, కాసర్ల యాదగిరి, జుమ్మిడి బానయ్య, అడేపు మహేష్, తదితరులు పాల్గొన్నారు.