అదిలాబాద్

ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నిర్భయంగా విధులు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, అక్టోబర్ 12: శాసనసభ సాధారణ ఎన్నికల వ్యయ పరిశీలన కోసం నియమించిన బృందాలు నిజాయితీతో నిర్భయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ఆర్ కె ఫంక్షన్‌హాల్‌లో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృంధాలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల వ్యయ పరిశీలన కోసం నియమించబడిన పర్యవేక్షణ బృంధాలు, ఫ్లెయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్, స్టాటిటిక్ సర్వేలైన్స్ బృందాలు నిజాయితీగా పనిచేయాలన్నారు. నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందుబాటులో ఉండి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. బృంధాలు ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఏ నియోజకవర్గానికి కేటాయించిన బృంధాలు ఆ నియోజకవర్గంలోనే ఉండి ఈ ఆర్‌వో సూచనల మేరకు పనిచేయాలన్నారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 7.04 లక్షల మంది జనాభా ఉంటే 2018న 9.30 లక్షల మంది ఉన్నారని, వీరికోసం 749 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందని సెప్టెంబర్ 10 నుండి 15 వరకు నిర్వహించి ప్రత్యేక ఓటరు కార్యక్రమంలో 1.09 లక్షల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని వీరికి ఈరోజు 12న విడుదల చేయనున్నట్లు తుది జాబితాలో ఓటు హక్కు కల్పించనున్నట్లు తెలిపారు. నెట్ కనెక్టివిటి ఉందో లేదో చూడాలని అక్కడ ఎ నెట్‌వర్క్ పనిచేస్తుందో తెలియజేయాలన్నారు. ప్రతీ అధికారి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఫోన్ ఎప్పుడు కూడా ఆన్‌లైన్‌లో ఉండాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.్భస్కర్‌రావు ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రమేష్ రాథోడ్, ఆర్డీవో ప్రసూనాంభ, రాజు, వినోద్, వివిధ పర్యవేక్షణ కోసం నియమించబడిన బృంధాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.