అదిలాబాద్

విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్, అక్టోబర్ 12 : విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎన్‌పీడీసీఎల్ సీఎండి ఏ వేణుగోపాల్‌రావు ఆదేశించారు. శుక్రవారం నస్పూర్ ఏరియాలోని సింగరేణి అతిథిగృహంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు విద్యుత్ కనెక్షన్‌లు త్వరగా అందజేయాలన్నారు. గృహాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలన్నారు. కొత్త దరఖాస్తులు చేసుకునే రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా చెడిపోయిన విద్యుత్ మీటర్లను ఎప్పటికప్పుడు మార్చాలన్నారు. విద్యుత్ బిల్లులు బకాయిలు లేకుండా చూసుకోవాలని ట్రాన్స్‌ఫార్మర్‌లు చెడిపోతే వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నారు. వినియోగదారులకు నష్టం జరిగేలా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. కార్యక్రమంలో సీజీ ఎం నగేష్, ఎస్‌ఈలు రమేష్ బాబు, ఉత్తమ్, డిప్లమో ఇంజనీరింగ్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ రావు, కుమారస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
12 ఎం ఎన్‌సిపి 17: సమీక్షాసమావేశంలో మాట్లాడుతున్న సి ఎం డి గోపాల్ రావు
12 ఎం ఎన్‌సిపి 18: సమావేశానికి హాజరైన అధికారులు

ఓడిపోతామనే భయంతోనే మహాకూటమిపై విమర్శలు
* కేసీఆర్ కుటుంబ స్వార్థ్యం కోసమే అసెంబ్లీ రద్దు
* మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్
బెల్లంపల్లి, అక్టోబర్ 12: వచ్చే ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే అపద్దర్మ ముఖ్యమంత్రి కేసి ఆర్ మహా కూటమి నాయకులపై లేని పోనీ విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని సిపి ఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సందర్బంగా ముఖ్యమంత్రి కేసి ఆర్ మాట్లాడుతూ మన నీళ్లు, మన వనరులు మన సందర్బంగా మన ఉద్యోగాలు మనకే అన్న కేసి ఆర్ నేడు రాష్ట్రంలో ప్రజలకు , నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం చేయలేదని విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రజలకు మాయ మాటలు చెప్పి కుటుంబ పాలన సాగించి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నేరవేర్చకుండా తన కుటుంబ స్వార్థ్యం కోసం అసెంబ్లీని రద్దు చేశారని విమర్శించారు. 9 మాసాల ముందుగానే అసెంబ్లీని ఏక పక్షంగా రద్దు చేయడం ఆయన చేతకానీ తనానికి నిదర్శనం అన్నారు. రాష్ట్ర పరిపాలన చేతకాకనే ప్రభుత్వాన్ని రద్దు చేశారన్నారు. మూఢ నమ్మకాలు , జ్యోతిష్యాలపైనే కేసి ఆర్ కు నమ్మకం ఉందన్నారు. ప్రజాస్వామ్యం రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వాన్ని రద్దు చేశారన్నారు. రాష్ట్రంలో కేటి ఆర్ ను ముఖ్యమంత్రిని చేసి, కేంద్రంలో కేసి ఆర్, కవిత, రాజకీయ చక్రం తిప్పుద్దామనే అత్రూత ఎక్కువ గా ఉందన్నారు. ప్రజలు నిరసన చెప్పే ధర్నా చౌక్‌ను ఎత్తివేసి నిరుద్యోగులకు ప్రజలను వంచించారన్నారు. ఈ ఎన్నికలలో మాహా కూటమి గెలిస్తుందనే భయంతోనే మహా కూటమి నాయకులపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ , టిడిపి, సిపి ఐ , టి జే ఎస్ పార్టీలు మహా కూటమిగా ఏర్పాడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో టి ఆర్ ఎస్ పార్టీని ఓడించేందుకు మహాకూటమి అభ్యర్థులు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో కేసి ఆర్ ప్రజలకు చేసిందేమి లేదని ఈ ఎన్నికలలో టి ఆర్ ఎస్ పార్టీని ఓడించడమే ధ్యేయంగా మహా కూటమి పని చేస్తుందన్నారు. తీవ్ర పదజాలంతో కేసి ఆర్ రాజకీయ పార్టీలను దూషిస్తున్నారని, సీఎం హోదా మరిచి బజార్‌రౌడీల మాట్లాడటం సరైంది కాదన్నారు. ఈ ఎన్నికలలో మహా కూటమి అభ్యర్థిని భారీ మేజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం సీపీఐ పట్టణ కార్యదర్శి మంతెన మల్లేష్ మాట్లాడుతూ బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల, నివాస గృహాలకు ఇండ్ల పట్టాలు, ఇంటింటికి నల్లా కనెక్షన్, బస్సు డిపో, పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ అప్‌గ్రేడ్ అనేక వాగ్దానాలు ఇచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య ఏఒక్క హామీని నేరవేర్చలేదని విమర్శించారు. వీటికి చిన్నయ్య సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు డీఆర్వో శ్రీ్ధర్, బొంతల లక్ష్మి నారాయణ తదిరులు పాల్గొన్నారు.

రాహుల్ పర్యటనపైనే హస్తనేతల ఆశలు
20న నేరడిగొండలో భారీ బహిరంగ సభ
రెండు లక్షల జన సమీకరణ లక్ష్యం

ఆదిలాబాద్, అక్టోబర్ 12: టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు అనంతరం ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రాహుల్ గాంధీ జిల్లా పర్యటన ఆ పార్టీ నేతల్లో ఆశలు రేకెత్తించనుంది. రెండు మూడు రోజుల్లో మహాకూటమి సీట్ల సర్దుబాటు అనంతరం కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు ఉంటుందని అంతటా ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే ఈనెల 20న రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ బహిరంగ సభలో పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపిక వాయిదా పడే అవకాశం ఏర్పడింది. శుక్రవారం ఏఐసిసి కార్యదర్శులు శ్రీనివాస కృష్ణన్, బోస్‌రాజ్‌లు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, నేతలు సుజాత, మహేశ్వర్ రెడ్డి, నరేష్ జాదవ్‌లు నేరడిగొండ సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. వీలైతే ఇచ్చోడ కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాట్లపై పరిశీలించనున్నారు. ఈనెల 20న ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు లక్షల జనాన్ని సమీకరించేలా నేతలకు బాధ్యతలు అప్పగించడం జరిగిందని డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ ఆదిలాబాద్ వెనకబడిన జిల్లాను ఎంపిక చేసుకోవడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నా డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఏకపక్షంగా నేరడిగొండ సభను ఎంపిక చేయడం పట్ల ఆ పార్టీలోని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉట్నూరు ఏజెన్సీ కేంద్రంలో లేదంటే బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు అనుసంధానంగా ఉన్న ఇచ్చోడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉంటే జనసమీకరణకు కూడా ఏలాంటి ఇబ్బందులు తలెత్తివి కాదని, దూర ప్రాంతాన్ని ఎంచుకోవడం కష్టంగా మారిందని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వాపోయారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ బట్టివిక్రమార్క అధ్వర్యంలో రోజుకు మూడు నాలుగు సభలు ఏర్పాటు చేసే విధంగా షెడ్యూల్ ఖరారు చేయగా సభలతో పాటు ప్రచార ర్యాలీలు, రోడ్‌షోలు నియోజకవర్గాల్లో కొనసాగేలా ప్రణాళికలు రూపొందించారు. వచ్చే రెండో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 20న హైదరాబాద్ నుండి హెలిక్యాప్టర్ ద్వారా ఉదయం 11 గంటలకు నేరడిగొండ చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు ఇచ్చోడ, భైంసాలో రోడ్‌షో ఏర్పాటు చేసి కామారెడ్డిలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాంగ్రెస్ నేతల్లో వీడని ఉత్కంఠ
అభ్యర్థుల ఖరారుపై జాప్యం నెలకొనడంతో ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఆదిలాబాద్ నుండి మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, భార్గవ్‌దేశ్‌పాండే టికెట్‌పై ఆశలు పెంచుకొని ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా ఈనియోజకవర్గంలో అనుచరులు ఎవరికివారే ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. నిర్మల్, ఆసిఫాబాద్ నుండి ఒకటి చొప్పున దరఖాస్తులు రావడం, ఖానాపూర్‌లో మాజీ ఎంపి రమేష్ రాథోడ్ పేరును స్క్రీనింగ్ కమిటీకి ఒకే దరఖాస్తు వెల్లడంతో ఆయన పేరు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం సాగుతోంది. ఆసిఫాబాద్‌లో సక్కు, నిర్మల్‌లో మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్‌లో రమేష్ రాథోడ్ పేర్లను ముందుగానే ఖరారు చేసి ఆ తర్వాత మిగితాఅభ్యర్థుల జాబితాను రాహుల్ పర్యటన అనంతరంమే ప్రకటించే అవకాశం ఉంది. బోథ్‌లో టికెట్ కోసం పోటీపడుతున్న నియోజకవర్గ ఇంచార్జి అనిల్ జాదవ్, ఆదివాసీ నాయకుడు సోయం బాపురావులు తీవ్రంగా పోటీపడుతుండగా మహేశ్వర్ రెడ్డి కావాలనే నేరడిగొండలో బహిరంగ సభ పెట్టించారని ప్రత్యర్థి వర్గీయులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఆశావాహుల్లో ఉత్కంఠత నెలకొన్నప్పటికీ కార్యకర్తల్లో మాత్రం రాహుల్ బహిరంగ సభ కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది.

కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
* మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్, అక్టోబర్ 12: రైతును రాజు చేయటమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆపద్దర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నిర్మల్ దివ్యాగార్డెన్‌లో జరిగిన మామడ మండలం టీఆర్‌ఎస్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీసంఖ్యలో హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయ పథకాలు పూర్తయితే రానున్న రోజుల్లో నిర్మల్ నియోజకవర్గంలో 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని వివరించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్న సంగతి గుర్తుచేశారు. ఒక్క నిర్మల్ నియోజకవర్గంలోనే నెలకు సుమారు 60వేల పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పేరుతో కోటి ఎకరాల మాగాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు కోర్టులకెక్కి అడుగడుగునా అడ్డుపడుతున్నారన్నారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా పనిచేసిన శక్తులన్నింటితో కాంగ్రెస్ జత కూడిందని, ప్రజలు ఆ కూటమికి గట్టిగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కుటిల రాజకీయాలకు అడ్డుకొని, తెలంగాణ రాష్ట్ర అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తోందని మంత్రి వివరించారు. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పూర్త సమన్వయంతో పనిచేసి మంచి మెజార్టీ వచ్చేలా కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీహరిరావు, పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మెన్ లోక భూమారెడ్డి, సత్యనారాయణ గౌడ్, విఠల్‌రావు, హరీష్‌రావు, నవీన్‌రావు, వెంకట్‌రాంరెడ్డి, రాజేంధర్, రఫీ, సత్యనారాయణ, రామ్‌కిషన్‌రెడ్డి, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.