అదిలాబాద్

బెల్లంపల్లి సీటు కోసం రాహుల్ గాంధీతో గద్దర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, అక్టోబర్ 12: బెల్లంపల్లి అసెంబ్లీ సీటును తన కుమారుడు అయిన సూర్యకిరణ్‌కు మహాకూటమి తరుపున కేటాయించాలని కోరుతూ శుక్రవారం ప్రజా గాయకుడు గద్దర్, ఏఐసిసి కార్యదర్శి మధు యాష్కి గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజా స్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతు పలికాడని గద్దర్ రాహుల్ గాంధీతోకోరినట్లు తెలిసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కు మహా కూటమికి అనుకూలంగా ప్రచారం చేసే బాధ్యతలను కాంగ్రెస్ పార్టీకి అప్పగించినట్లు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణ, సింగరేణి బొగ్గు గని ప్రాంతాలలో మహాకూటమి తరుపున గద్దర్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టే బాధ్యతలను పోందారు. అంతేకాకుండా బెల్లంపల్లి టికేట్‌ను ఆశిస్తున్న సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ను తప్పించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సూరవరం ను గద్దర్ అభ్యర్థించినట్లు తెలుస్తుంది. రాహుల్ గాంధీని కలిసిన వారిలో గద్దర్, ఆయన భార్య విమల, ఆయన కుమారుడు సూర్యకిరణ్ ఉన్నారు.