అదిలాబాద్

కాంగ్రెస్‌లో చేరిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, అక్టోబర్ 14: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తితోపాటు 20 మంది కౌన్సిలర్లు టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి మహేశ్వర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిర్మల్‌లోని అప్పాల గణేష్ చక్రవర్తి నివాసంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో మహేశ్వర్‌రెడ్డి కౌన్సిలర్లకు కాంగ్రెస్ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఇలాఖాలో ఒక మున్సిపల్ ఛైర్మెన్, 20 మంది కౌన్సిలర్లు టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయడంపట్ల ప్రభుత్వంపై ఏమేరకు వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు, బలహీనవర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. మున్సిపల్ చైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి కుటుంబానికి కాంగ్రెస్‌పార్టీతో తరతరాలుగా మంచి సంబంధాలున్నాయని ప్రత్యేక పరిస్థితులవల్ల కొంతకాలం టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికి తిరిగి కాంగ్రెస్‌లో చేరడం ఆనందంగా ఉందన్నారు. గణేష్ చక్రవర్తికి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీనిచ్చారు.
సొంతింటికి వచ్చినట్లుంది: మున్సిపల్ చైర్మన్ గణేష్ చక్రవర్తి
టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం సొంతింటికి వచ్చిన అనుభూతిని కలిగిస్తోందని మున్సిపల్ చైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. తమ తాతల తరంనుండి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారన్నారు. టీ ఆర్ ఎస్ ప్రభుత్వం గత నాలుగేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలమైందన్నారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గత నాలుగేళ్లుగా తమను క్షోభకు గురిచేశారని, కనీసం ప్రతిపక్ష హోదాకంటే హీనంగా చూశారన్నారు. టీ ఆర్ ఎస్ ప్రభుత్వం, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకే రాజీనామా చేశామని పేర్కొన్నారు. ఈనెల 20న ముధోల్ నియోజకవర్గంలో జరిగే కాంగ్రెస్‌ఫార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్‌గాంధీ సమక్షంలో భారీ ర్యాలీ నిర్వహించి వేలాది మంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.