అదిలాబాద్

గ్రామాలను ఆదర్శంగా తీర్చి దిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, అక్టోబర్ 23: నియోజక వర్గంలోని గ్రామాలను అభివృద్ది చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దుతామని పెద్దపల్లి ఎంపీ, చెన్నూర్ నియోజక వర్గ అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు. మంగళవారం జైపూర్ మండలంలోని శెట్‌పల్లిలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఇంటింటా ప్రచారానికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా కేసి ఆర్ అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికలలో ఇచ్చిన హామీలలోభాగంగా పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు. చెన్నూర్ నియోజక వర్గాన్ని సిరిసిల్ల,సిద్దిపేట లాగా అభివృద్ది చేసి చూపిస్తానని తెలిపారు. మండలంలోని శెట్‌పల్లి, మద్దులపల్లి, బెజ్జాల,గంగిపల్లి, ఎల్కంటి, నర్సింగ పూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. తమను అధిక మేజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం శెట్‌పల్లి గ్రామానికి చెందిన ప్రజలు రూ.5000 లను నామినేషన్‌కు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రాజ్‌కుమార్, ఎంపీపీ మెండే హేమలత, స్థానిక నాయకులు , కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

25న కాగజ్‌నగర్ కేంద్ర మంత్రి రాక
కాగజ్‌నగర్, అక్టోబర్ 23: ఈనెల 25 న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హాన్స్‌రాజ్ గంగారాం ఆహిర్ కాగజ్‌నగర్ రానున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈవిషయం వెల్లడించారు. స్థానిక ఆర్ ఆర్ ఓ కాలనీలో నిర్వహించే బీజేపీ పార్టీ నియోజక వర్గ శక్తి కేంద్రాల ఇంచార్జ్‌లకు బూత్ స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఈ తరగతులకు ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశానికి బూత్ లెవల్ నాయకులు శక్తి కేంద్రాల ఇంచార్జ్‌లు కార్యకర్తలు పెద్ద ఎత్తున్నహాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఠాకూర్ విజయ్‌సింగ్, జిల్లా ఉపాధ్యక్షులు పుల్గం నారాయణ, పట్టణ అద్యక్షులు గోలెం వెంకటేష్, దహెగాం మండల అధ్యక్షులు సత్యనారాయణ, బీజే వై ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శరత్ శర్మ, పార్టీ నాయకులు జలీల్, ఇమ్మానుయ్యేల్, తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
కుభీర్, అక్టోబర్ 23: కుభీర్ మండలంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డ సమక్షంలో తెరాసాలోకి భారీగా చేరినట్లు పార్టీ మండల కన్వీనర్ ఎన్నిల అనీల్ తెలిపారు. రంజినిలో 50 మంది, చోండిలో 70 మంది, కస్రాలో 40 మంది యువకులు తెరాసా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విఠల్‌రెడ్డి మాట్లాడుతూ తెరాసా సంక్షేమ పథకాలుచూసి యువత ఆకర్షితులవుతున్నారు. నిరుద్యోగ భృతి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ఎంతగానో కృషిచేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తూము రాజేశ్వర్, ఎన్నిల అనీల్, శంకర్ చౌహాన్, మొహినొద్దిన్ పాల్గొన్నారు.