అదిలాబాద్

అలకవీడిన ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,అక్టోబర్ 23: దసరా పండగ రోజు టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకొని రభస సృష్టించిన సంఘటన నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్న ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా ఎట్టకేలకు అలక వీడి మంగళవారం మంత్రి రామన్నతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. దసరా పండగ రోజు టీఆర్‌ఎస్ నేతలు వేదిక దిగాలని గొడవకు దిగిన సంఘటన నేపథ్యం లో మనీషా తన అనుచరులు కార్యకర్తల సమక్షంలో కంటతడి పెట్టగా మంత్రి జోగురామన్న కల్పించుకొని ఆమెను ఓదార్చినప్పటికీ పార్టీ ప్రచారానికి ముందుకు రాలేదు. నాలుగు రోజులుగా ఇంటివద్దే ఉంటున్న మున్సిపల్ చైర్మెన్ మంత్రి రామన్న విన్నపం మేరకు మంగళవారం పట్టణంలోని తిర్పెల్లి, తాటిగూడ కాలనీల్లో జరిగిన టీఆర్‌ఎస్ ప్రచారంలో పాల్గొనగా ఓటర్లతో నేరుగా కలుసుకోకుండా మంత్రి వెంటే వౌనంగా కాలనీల్లో తిరగడం గమనార్హం.

నిరుపేద వర్గాలకు టీఆర్‌ఎస్ బాసట
పేదల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడేది టీ ఆర్ ఎస్ పార్టీ మాత్రమేనని, కూలీలు, రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడంలో తమ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం పట్టణంలోని తిర్పెల్లి కాలనీలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కాలనీల్లో వృద్దులు, మహిళలను అప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ కాలనీలో కూరగాయలతో ఎదురుగా వచ్చిన తోపుడు బండిని ఆపి వారి సమస్యల గురించి ఆరా తీశారు. ముచ్చటగా కూరగాయలను విక్రయిస్తూ అందరిని ఆకట్టుకున్నారు. నాలుగున్నరేళ్ళలో ఎంతో అభివృద్దిచేశామని, మరోసారి అవకాశం ఇస్తే కాలనీల్లో సమస్యలు లేకుండా చూస్తామని మంత్రి రామన్న హామీ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాసిట్లుకూడా రావని అన్నారు. తమకు అధికారం కట్టబెడితే నిరుద్యోగ భృతి రూ.3016 అందజేస్తామని, మహిళల సంక్షేమంతో పాటు వారి వైద్యసేవలకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని మంత్రి అన్నారు. అనంతరం వివిధ కాలనీల్లో ఇంటింటా పర్యటిస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటూనే కారుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రామన్న వెంట టీఆర్‌ఎస్ నాయకులు యూనిస్ అక్బాని, ఐసిడి ఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, కౌన్సిలర్ అజయ్, మాజీ మున్సిపల్ చైర్మెన్ బాదం గంగన్న, సుఖెందర్ తదితరులు పాల్గొన్నారు.

కమిటీ నిర్ణయం ప్రకారమే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీరు సరఫరా
* నీటి పారుదల అధికారి వేణుగోపాల్ రావు
మంచిర్యాల, అక్టోబర్ 23: జిల్లా కేంద్రంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లో 1 సెప్టెంబర్ 2018 తరువాత 19 టి ఎం సి లు అనగా 147.60 మీ. నీటిని నిల్వ ఉంచేందుకు కమిటీ నిర్ణయించడం జరిగిందని రాష్ట్ర నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ది శాఖ కార్యనిర్వహాక ఇంజనీర్ , జిల్లా నీటి పారుదల అధికారి యం వేణుగోపాల్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 19 టి ఎం సిల కంటే ఎక్కువగా ఉన్న నీటిని త్రాగు నీటి ఎత్తిపోతల పథకంలతో సహా మంథని ఎత్తిపోతల పథకం, ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం లు అందుబాటులోని చెరువులకు నిరంతరంగా నీటి సరఫరా జరుగుతుందని గూడెం ఆయకట్టుకు మాత్రం కడెం ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. ఈనెల 22 న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటి మట్టం 19.73 టి ఎం సిలుగా ఉన్నందున నీటిని ఎన్‌టిపిసి , హెచ్ యం డబ్ల్యు ఎన్ ఎన్ బీ , మిషన్ భగీరథ ల కోసం మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండం మున్సిపాలీటీలకు త్రాగు నీరు అవసరాల కోసం పంపింగ్ చేయవలిసి ఉందని ఆయకట్టు కడెం ప్రాజెక్ట్ ఆయకట్టు నుండి కూడా రీ జనరేటెడ్ నీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో చేరుతున్నందున గత సంవత్సరం మాదిరిగానే గూడెం ఆయకట్టుకు రబీ కొరకు కడెం ప్రాజెక్ట్, గూడెం ఎత్తిపోతల పథకం నుండి నీరు అందించే అవకాశం ఉందని తెలిపారు.