అదిలాబాద్

ఎన్నికల్లో మహాకూటమికి ఓటమి ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, అక్టోబర్ 23: రాబోయే ఎన్నికల్లో మహాకూటమికి ఓటమి ఖాయమని రాష్ట్ర ఆపద్దర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు భారీగా టీ ఆర్ ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా బుధవార్‌పేట్ వార్డు నంబర్‌లు 10,11,12, శేఖ్ పేట్, ఇస్లాంపూర్ వార్డులతోపాటు దిలావర్‌పూర్ మండలంలోని టెంబుర్ని, లక్ష్మణచాంద మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు, మైనార్టీ వర్గానికి చెందిన సుమారు వెయ్యి మంది టీ ఆర్ ఎస్‌లో చేరడంతో వారికి మంత్రి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహా కూటమి పేరుతో సీట్ల పంచాయతీ తేల్చుకోలేని వారు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. మహాకూటమి మాయ మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కల్పనతో కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఉద్యోగాలను మన నీళ్లు, నిధులను తన్నుకుపోయేందుకు కుట్రలు పన్నుతున్న చంద్రబాబుతో కాంగ్రెస్‌పార్టీతోపాటు ఇతరులు జతకట్టడంపై మంత్రి ధ్వజమెత్తారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టిన వలస పాలకులు మళ్లీ ఒక్కటి కావడం విడ్డూరమన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ హయాంలో జరగని అభివృద్ది నాలుగేళ్లలో చేసి చూపిన ఘనత కేసీ ఆర్‌కే దక్కిందన్నారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా అనేక పథకాలను అమలుచేస్తున్నామన్నారు. అభివృద్దినిచూసి అన్నివర్గాల ప్రజలు టీ ఆర్ ఎస్‌లో చేరడానికి ముందుకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీ ఆర్ ఎస్ సీనియర్ నేత కె.శ్రీహరిరావు, నిర్మల్ మార్కెట్ కమిటి చైర్మెన్ ధర్మాజి రాజేంధర్, గ్రంథాలయ చైర్మెన్ ఎర్రవోతు రాజేంధర్, టీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మారుగొండ రాము, అట్ల రాంరెడ్డి, అల్లోల తిరుపతిరెడ్డి, లక్ష్మణచాంద మాజీ సర్పంచ్ బిట్లింగు నారాయణ, టీ ఆర్ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అడ్వాల రమేష్, ఈటెల శ్రీనివాస్, కత్తి సురేష్, పడిగెల రవి, చిట్టి గణప్రసాద్, దోనగిరి కళ్యాణ్, పత్తి భూమేష్, దర్శనం విజయ్, కృష్ణ, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌లో భారీ వర్షం, ఈదురుగాలులు
* పిడుగుపాటుకు తల్లి,కూతుళ్ల మృతి
ఆసిఫాబాద్, అక్టోబర్ 23: కుమర్రంభీం జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షం గంట పాటు ఎడతెరిపి లేకుండా కురియడంతో జనం బెంబేలెత్తి పోయారు. పిడుగుపాటుకు తలీ,కూతుళ్లు మృతి చెందారు. వీధులన్నీ నిర్మాణుష్యం మారాయ. కాగా, రోడ్లన్నీ జలమయ మయ్యా యి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. ఎక్కడ పడితే అక్కడ వర్షపునీరు నిలిచి ప్రజలకు ఇబ్బంది కరంగామారింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వర్షపునీరు చేరింది. మరోవైపు ఈవర్షం పట్టణంతోపాటు సమీపంలోని గ్రామాల్లోనూ కురిసింది. దీంతో పత్తిపంటకుకొంత మేలు జరిగిందనే సంతోషం రైతుల్లో కనిపిస్తుండగా, చేతికొచ్చిన పంట కాస్త పాడైందనే ఆందోళన మరికొంత మందిలో వ్యక్తమవుతోంది. పత్తి చెట్లపై ఉన్న కాయలు పగిలి బయటికి వచ్చిన పత్తి కాస్త నేలపాలైందంటూ రైతులు వాపోయారు. ఈదురుగాలులకు పలుచోట్ల పంట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రైతులు అమ్మకానికి తీసుకొచ్చే పత్తి సైతం పూర్తిగా తడిచి పోయింది. మరోవైపు బాబాపూర్ ప్రాంతంలోని పత్తి చేండ్లు ఈదురు గాలులతో కూడిన వర్షానికి నేల కూలాయి. దీంతో ఆదుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.

నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్
* జిల్లాలకు భీం వర్ధంతి సెలవు
ఆదిలాబాద్, అక్టోబర్ 23: ఆదివాసీల ఆరాధ్యదైవం కుమురంభీం వర్ధంతిని పురస్కరించుకొని కెరమెరి మండలం జోడెఘాట్‌లో ఐటిడి ఏ తరపున భీం వర్ధంతిని నిర్వహిస్తున్న నేపథ్యంలో రెండు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కలెక్టర్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు బుధవారం సెలవుదినంగా ప్రకటించడం జరిగిందని ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య దేవరాజన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. తిరిగి నవంబర్ 10 రెండో శనివారం సంధర్భంగా పాఠశాలలు, కళాశాలలకు పనిదినంగా గుర్తించడం జరిగిందని తెలిపారు.