అదిలాబాద్

తొలిరోజు మూడు నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 12: ఎన్నికల గజిట్ నోటిఫికేషన్ సోమవారం విడుదల కావడంతో తొలిరోజు నామమాత్ర ంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గా ల్లో ప్రత్యేకంగా రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో నామినేషన్ల స్వీకరణ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చే యగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ని యోజకవర్గ కేంద్రాలు మినహా మిగితా ఎనిమిదిచోట్ల ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ముహూర్తం, తిథి, వర్జ్యం, నక్షత్రం సోమవారం బాగాలేద ని పండితులు జోస్యం చెప్పడంతో పో టీచేసే అభ్యర్థులు మంచి ముహూర్తాన నామినేషన్ దాఖలు చేసేందుకు ఏరా పట్లు గావిస్తున్నారు. సోమవారం తొలి రోజు ఆసిఫాబాద్ నియోజకవర్గ కేం ద్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి నామినేషన్ పత్రాల ను సమర్పించగా ఆమె వెంట ఎమ్మెల్సీ పురాణం సతీష్, కుమురంభీం మనువడు సోనెరావు తదితరులు బలపర్చి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి సిడాం దత్తుకు అందజేశారు. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకు లు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చేతిగుర్తు కండువాలు కప్పుకొని నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వీరిద్ద రూ కార్తీక సోమవారంరోజు చూసుకొని ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం ముహూర్తం బాగుండడంతో నామినేషన్ వేసినట్లు తెలిసింది. ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలయింది. ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్‌కు చెందిన తొగరి రాములు ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణకు అందజేశా రు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ ప త్రాలను స్వీకరించారు. మిగతా ఎనిమి ది నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు బోసిపోయాయి.
ఈనెల 14న ముహూర్తం బాగుండడంతో రాజకీయ పార్టీల నేతలు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడానికి ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. అదే రోజు ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వెల్‌లో నామినేషన్లు దాఖలు చేస్తుండగా ఆదివారం రాత్రి పార్టీ అధినేత నుండి బిఫాంలు పొందిన టీఆర్‌ఎస్ అభ్యర్థు లు మంచి ముహూర్తం చూసి ఆ రోజు భారీ ర్యాలీలతో నామినేషన్లు దాఖలు చేసేలా సర్వం సిద్దం చేసుకున్నారు. ఆ దిలాబాద్‌లో మంత్రిజోగురామన్న, బి జెపి అభ్యర్థి పాయల శంకర్ నామినేష న్లు వేయనుండగా అదేరోజు 14న నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, చెన్నూరు లో ఎంపి బాల్క సుమన్, ఖానాపూర్ లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రేఖానాయక్, ముథోల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి విఠ్ఠల్ రె డ్డి నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు పా ర్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 19 వర కు నామినేషన్లకు చివరి గడవు ఉన్నప్పటికీ 14న ముహూర్తం కుదరడంతో అదేరోజు భారీసంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి.