అదిలాబాద్

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక కూర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,నవంబర్ 13: కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడ్డ అధిష్ఠానం ఎట్టకేలకు సర్వే ఆధారంగానే ఆచితూచి అభ్యర్థులను ఖరారు చేసింది. సోమవారం రాత్రి తొలి జాబితాలో 65 మంది అభ్యర్థులను ఖరారు చేయగా జిల్లా నుండి ఏడుగురు నేతలకు చోటు లభించింది. జిల్లా స్థాయిలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డిల మద్య టికెట్ల కేటాయింపులోనూ అదిపథ్య పోరు కొనసాగగా స్థానికంగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థుల సామాజిక అంశాలు, సర్వే ఆధారంగానే ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే భట్టి విక్రమార్క వర్గంగా పేరున్న నలుగురికి తొలి జాబితాలోనే టికెట్లు లభించడం గమనార్హం. రేవంత్‌రెడ్డి వర్గానికి మొండిచేయి ఎదురైంది. రేవంత్‌రెడ్డి జిల్లా నుండి తన వర్గంగా చెప్పుకునే బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు, సిర్పూర్‌టి నుండి రావి శ్రీనివాస్, చెన్నూర్ నుండి బోడ జనార్ధన్‌కు టికెట్ దక్కాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భట్టి వర్గంగా చెలామణి అయ్యే మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావుకు మంచిర్యాల స్థానాన్ని ఖరారు చేయగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గంగా చెప్పుకుంటున్న అరవింద్ రెడ్డికి ఎదురుదెబ్బె తగిలింది. భట్టివిక్రమార్క వర్గంలోని గండ్రత్ సుజాత ( ఆదిలాబాద్), కె.ప్రేంసాగర్‌రావు (మంచిర్యాల), ఆత్రం సక్కు ( ఆసిఫాబాద్), వెంకటేష్ నేత (చెన్నూరు), హరీష్‌రావు (సిర్పూర్‌టి)లకు తొలి జాబితాలో స్థానం లభించగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గమైన మహేశ్వర్ రెడ్డి (నిర్మల్), రామారావు పటేల్ (ముథోల్) పేర్లు ఖరారయ్యాయి. అభ్యర్థుల ఖరారుతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం వెల్లివిరియగా వారి నివాస గృహాలు పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడాయి. ముహూర్తం చూసుకొని నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు సమాయత్తమయ్యారు.
రాథోడ్ రమేష్‌కు చుక్కెదురు..
తొలి జాబితాలోనే ఖానాపూర్ అభ్యర్థిగా రాథోడ్ రమేష్ పేరు ఖరారు అవుతుందని అందరూ భావించినప్పటికీ జాబితాలో పేరు కనిపించకపోవడంతో రాథోడ్ వర్గీయులు నిరుత్సాహనికి గురయ్యారు. చేతి గుర్తుతో ప్రచారం ముమ్మరం చేసి అందరికంటే ముందు ప్రచారంలో దూసుకవెళ్తున్న నేపథ్యంలో జిల్లా నుండి ఏడుగురు పేర్లను ప్రకటించి రాథోడ్ పేరు విస్మరించడంపై పార్టీ శ్రేణుల నుండి అసంతృప్తి భగ్గుమంది. అక్కడ నియోకవర్గ ఇంచార్జి హరినాయక్ వర్గం రాథోడ్ రమేష్‌కు టికెట్ ఇవ్వొద్దని గాంధీ భవన్‌ను ముట్టడించి నిరసన తెలుపడం, ప్యారాచుట్ నేతలకు స్థానం కల్పించవద్దని రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయడంతోనే రాథోడ్ రమేష్ పేరు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బోథ్ నియోజకవర్గం నుండి సోయం బాపురావుకు టికెట్ రాకపోవడంతో ఆయన వర్గీయులు నిరుత్సాహనికి గురయ్యారు. నియోజకవర్గ ఇంచార్జి అనిల్ జాదవ్ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది.
బెల్లంపల్లి సీటు సీపీఐకే..
మహాకూటమి పొత్తుల్లో భాగంగా భాగస్వామ్య సిపి ఐ పార్టీకి మూడు స్థానాలు కేటాయించగా బెల్లంపల్లి ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో సిపిఐ అభ్యర్థి గుండా మల్లేష్ బరిలో దిగే అవకాశం ఉంది. సిపిఐ అభ్యర్థుల జాబితా బుధవారం ఖరారు చేయనుండగా మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మిగితా టిడిపి, తెలంగాణ జన సమితి పార్టీలు మిగితా జిల్లాల్లో ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క స్థానంలో కూడా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.