అదిలాబాద్

వాగ్దానాలు నెరవేర్చని టీఆర్‌ఎస్‌ను ఓడించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, నవంబర్ 14: రాష్ట్రంలో గత ఎన్నికల సందర్బంగా వాగ్దానాలిచ్చిన టి ఆర ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కాలంలో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని మహా కూటమి సీపీఐ నేత గుండా మల్లేష్ అన్నా రు. బుధవారం పట్టణంలోని సిపి ఐ పార్టీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు, కమ్యూనిస్టు నాయకులు బాసెట్టి గంగారాం, పోతుగంటి పోశెట్టి చిత్రపటాలకు పూల మాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించడం చేతకాకనే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా పోయిందన్నారు. డబ్బులు, మందుతో ప్రజలను మభ్యపెట్టి మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కుట్ర పన్నుతున్నారని టి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తివేసి ప్రజా స్వామ్య హక్కును నాశనం చేశారన్నారు. ప్రజల వాగ్దానాలు నెరవేర్చని టి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు మహా కూటమిగా ఏర్పడ్డాయన్నారు. కమ్యూనిస్టుల చొరవ అమోఘమైందన్నారు. మహాకూటమి ఒప్పందాల్లో రాష్ట్రంలో ఉస్నాబాద్, ఖమ్మం జిల్లా వైరా, బెల్లంపల్లి కి మూడు సీట్లు కేటాయించారని ఆయన తెలిపారు.