అదిలాబాద్

రెండో విడతలో రాథోడ్ రమేష్‌దే పై‘చేయి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 14: కాంగ్రెస్ రెండో విడత జాబితాలో జిల్లా నుండి మాజీ ఎంపి రాథోడ్ రమేష్‌కు ఖానాపూర్ బెర్త్ ఖరారు కావడంతో ఆ పార్టీలో ఇంతకాలం నెలకొన్న ఉత్కంఠతకు తెరవీడింది. టీఆర్‌ఎస్ టికెట్ దక్కక కాంగ్రెస్‌లో చేరిన రమేష్ రాథోడ్‌కు ఆ పార్టీ నేతల నుండి వ్యతిరేకత ఎదురుకావడంతో తొలి జాబితాలో అవకాశం చేజార్చుకోవాల్సి వచ్చింది. అధిష్ఠానం వద్ద జరిగిన పంచాయతీలో ఎంపిగా పోటీచేయాలని కాంగ్రెస్ నేతలు సూచించగా ఇందుకు రాథోడ్ తిరస్కరించడమే గాక స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుస్తానని తేల్చిచెప్పడంతో స్క్రీనింగ్ కమిటీ మల్లగుల్లాలు పడ్డ అనంతరం రెండో విడత జాబితాలో బుధవారం ఆయన పేరును ఖరారు చేసింది. నార్నూర్ మండలం తాడిహత్నూర్‌లో జన్మించిన రాథోడ్ రమేష్ తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుండి జడ్పీటీసీగా రాజకీయ ప్రస్తానం మొదలైంది. లంబాడా వర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొందిన రమేష్ రాథోడ్ 1999 నుండి 2004 వరకు ఖానాపూర్ టిడిపి ఎమ్మెల్యేగా పనిచేయగా 2008 నుండి 2009 సంవత్సరం వరకు జడ్పీ చైర్మెన్‌గా, 2009 నుండి 2014 వరకు తెలుగుదేశం పార్టీ తరపున ఆదిలాబాద్ ఎంపిగా విజయం సాధించి జిల్లాలో రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రమేష్ రాథోడ్ టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత ఏడాది కెసి ఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖానాపూర్ అసెంబ్లీ బరిలో పోటీచేస్తానని ముందుగా కెసిఆర్ నుండి హామీ తీసుకున్న రాథోడ్ రమేష్‌కు టికెట్ దక్కకపోవడంతో రెండు నెలల క్రితమే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రెండో విడత జాబితాలో టికెట్ దక్కించుకున్నారు. దీంతో ఖానాపూర్‌లో రసవత్తర రాజకీయానికి తెరలేచినట్లయింది.
బోథ్‌లో ఇద్దరి మద్యే హోరా హోరి
...........................
బోథ్ అసెంబ్లీ బరిలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావుకు కాంగ్రెస్ టికెట్ ఖాయమని ప్రచారం సాగగా తొలి, రెండో విడత జాబితాలో ఆయన పేరు లేక పోవడంతో నిరాశకు గురయ్యారు. అసెంబ్లీ ఇంచార్జి అనిల్ జాదవ్ టికెట్ కోసం మహేశ్వర్ రెడ్డితో కలిసి అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు ముమ్మరం చేయడంతోనే సోయం బాపురావు టికెట్‌కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయాలని బాపురావుకు సూచించగా తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అసెంబ్లీ బరిలో ఉంటానని తేల్చిచెప్పినట్లు తెలిసింది. రెండు రోజుల్లో మూడో విడత జాబితాలో ఎవరి పేరు ఖరారు అవుతుందో ఉత్కంఠత నెలకొంది.
బెల్లంపల్లి సీటుపై సిపిఐ ..
....................
మహాకూటమి పొత్తులో భాగంగా బెల్లంపల్లి స్థానాన్ని సిపిఐకి కేటాయించడంతో అక్కడ సిపిఐ తరపున మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ బరిలో నిలుస్తున్నారు. ఈమేరకు పార్టీ రాష్టక్రార్యదర్శి మల్లేష్ పేరును ఖరారు చేయడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యతో తలపడనున్నారు.
తిరుగుబాట్లకు రె‘్ఢ’
.................
ఆయా పార్టీల అభ్యర్థుల ఖరారుతో అన్ని నియోజకవర్గాల్లోనూ అసంతృప్తి సెగ రగులుతోంది. టికెట్లు దక్కని నేతలు తిరుగుబావుట జెండా ఎగరవేసేందుకు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే కార్యకర్తలు, అనుచరులతో మంతనాలు సాగిస్తూ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముథోల్‌లో కాంగ్రెస్ టికెట్ దక్కని నారాయణరావు పటేల్ ఎన్‌సిపి పార్టీ జెండాతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలుస్తారని ప్రచారం సాగుతోంది. అదే విధంగా సిర్పూర్‌టిలో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ రావి శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. మంచిర్యాలలో కాంగ్రెస్ టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి బిజెపి తరపున పోటీచేస్తారని ప్రచారం సాగగా మనసు మార్చుకొని టీఆర్‌ఎస్‌తో జరిగిన మంతనాల మేరకు ఎమ్మెల్సీ పదవి ఎరచూపడంతో ఆయన గురువారం టీ ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.