అదిలాబాద్

హోరెత్తిన నామినేషన్ల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 14: నామినేషన్ల ఘట్టంలో బుధవారం తిథి, నక్షత్రం, ముహూర్తం కుదరడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు నామినేషన్లు పోటెత్తాయి. ముందుగానే ముహూర్తం నిర్ణయించుకొని సెంటిమెంట్‌తో అభ్యర్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటిపెద్దల ఆశీర్వచనాలతో రిటర్నింగ్ అధికారుల ముందు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ఖర్చుకు భయపడి అభ్యర్థులు సాదాసీదాగా వెళ్ళి నామినేషన్లతో జాగ్రత్తలు తీసుకున్నారు. నామినేషన్ల ఘట్టం మూడోరోజు హోరెత్తడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ల పర్వం మూడో రోజైన బుధవారం ఆదిలాబాద్‌లో మంత్రి జోగురామన్న ఉదయమే శాంతినగర్ కాలనీలో గల సాయిబాబా, శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, తన స్వగ్రామమైన దీపాయిగూడలో ఇంటిదేవునికి మొక్కులు చెల్లించి తల్లి బోజమ్మ దీవెనలు పొంది అనంతరం ముస్లీం దర్గా, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన కార్యకర్తలతో కలిసి సాదాసీదాగానే ఆర్డీవో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంలో నాలుగు నామినేషన్లు దాఖలు కాగా బిజెపి అభ్యర్థి పాయల శంకర్, బిఎస్పీ అభ్యర్థి ఈర్ల సత్యం, కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్ సుజాత, టీఆర్‌ఎస్ అభ్యర్థి జోగురామన్నలు రెండు సెట్ల చొప్పున నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణకు అందజేశారు. అదే విధంగా బోథ్‌లో తెరాస అభ్యర్థి రాథోడ్ బాపురావు, బిజెపి అభ్యర్థి మడావి రాజు నామినేషన్లు వేయగా బెల్లంపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య, బిఎల్‌ఎఫ్ అభ్యర్థి సబ్బని కృష్ణ, స్వతంత్ర అభ్యర్థి అంబాల మహెందర్ నామినేషన్లు వేశారు. నిర్మల్‌లో బిజెపి అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బిజెపి అభ్యర్థి స్వర్ణా రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం రెండు సెట్ల చొప్పున నామినేషన్లు వేశారు. ముథోల్ నియోజకవర్గం నుండి పోటీచేస్తున్న టీ ఆర్ ఎస్ అభ్యర్థి జి.విఠ్ఠల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్ ఆదిలాబాద్, నవంబర్ 14: నామినేషన్ల ఘట్టంలో బుధవారం తిథి, నక్షత్రం, ముహూర్తం కుదరడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు నామినేషన్లు పోటెత్తాయి. ముందుగానే ముహూర్తం నిర్ణయించుకొని సెంటిమెంట్‌తో అభ్యర్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటిపెద్దల ఆశీర్వచనాలతో రిటర్నింగ్ అధికారుల ముందు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ఖర్చుకు భయపడి అభ్యర్థులు సాదాసీదాగా వెళ్ళి నామినేషన్లతో జాగ్రత్తలు తీసుకున్నారు. నామినేషన్ల ఘట్టం మూడోరోజు హోరెత్తడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ల పర్వం మూడో రోజైన బుధవారం ఆదిలాబాద్‌లో మంత్రి జోగురామన్న ఉదయమే శాంతినగర్ కాలనీలో గల సాయిబాబా, శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, తన స్వగ్రామమైన దీపాయిగూడలో ఇంటిదేవునికి మొక్కులు చెల్లించి తల్లి బోజమ్మ దీవెనలు పొంది అనంతరం ముస్లీం దర్గా, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన కార్యకర్తలతో కలిసి సాదాసీదాగానే ఆర్డీవో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంలో నాలుగు నామినేషన్లు దాఖలు కాగా బిజెపి అభ్యర్థి పాయల శంకర్, బిఎస్పీ అభ్యర్థి ఈర్ల సత్యం, కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్ సుజాత, టీఆర్‌ఎస్ అభ్యర్థి జోగురామన్నలు రెండు సెట్ల చొప్పున నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణకు అందజేశారు. అదే విధంగా బోథ్‌లో తెరాస అభ్యర్థి రాథోడ్ బాపురావు, బిజెపి అభ్యర్థి మడావి రాజు నామినేషన్లు వేయగా బెల్లంపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య, బిఎల్‌ఎఫ్ అభ్యర్థి సబ్బని కృష్ణ, స్వతంత్ర అభ్యర్థి అంబాల మహెందర్ నామినేషన్లు వేశారు. నిర్మల్‌లో బిజెపి అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బిజెపి అభ్యర్థి స్వర్ణా రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం రెండు సెట్ల చొప్పున నామినేషన్లు వేశారు. ముథోల్ నియోజకవర్గం నుండి పోటీచేస్తున్న టీ ఆర్ ఎస్ అభ్యర్థి జి.విఠ్ఠల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్ ముందుగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజల్లో పాల్గొన్న అనంతరం నామినేషన్లు దాఖలు చేశారు. చెన్నూరులో టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ నామినేషన్ దాఖలు చేయగా ఆయన వెంట మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, మాజీ ఎంపి వివేక్ పాల్గొన్నారు. మంచిర్యాలలో శివసేన అభ్యర్థి కె.తిరుపతి, బిఎల్‌ఎఫ్ నుండి ఆరె శ్రీనివాస్, బిఎస్పీ నుండి బేర సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థి రంగు మల్లేష్ నామినేషన్లు వేశారు. సిర్పూర్‌టి నుండి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి హరీష్‌రావు, బిఎల్‌ఎఫ్ నుండి వెంకన్న నామినేషన్లు దాఖలు చేశారు. ఖానాపూర్ నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థి రేఖానాయక్, స్వతంత్ర అభ్యర్థి కనక తుకారాం ఉట్నూరు కేంద్రంలో నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లు పోటాపోటీగా దాఖలు కావడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. టికెట్లు దక్కని తిరుగుబాటు నేతలు అదునుచూసి 17, 19 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.