అదిలాబాద్

సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌కు శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 16: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ది పథకాలే ము ందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపుకు శ్రీరామరక్షగా నిలుస్తాయని అపద్దర్మ మంత్రి జోగురామన్న అన్నారు. శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి రామన్న ఆదిలాబాద్ మండలంలోని జంధాపూర్, పొచ్చర, రాంపూర్‌తోపాటు పట్టణంలోని పలువార్డులో ఇంటింటా ప్ర చారం చేపట్టారు. ఆయా గ్రామాలకు వెళ్ళిన మంత్రి రామన్నకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు తిలకం దిద్దుతూ స్వాగతం పలకగా డప్పు వాయిద్యాలతో ఎన్నికల ర్యాలీ లు నిర్వహించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణకు మార్చేందుకు అభివృద్ది బాట లు వేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మ రోసారి ప్రజలందరూ అండగా నిలువాలని, ముందస్తు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో ఏ పార్టీ కూడా ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసిన దాఖాలలు లేవని, కేవలం టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని ఎన్నో హామీలను అమలు చేయడం జరిగిందన్నారు. నాలుగున్నరేళ్ళ టీఆర్‌ఎస్ పాలనలో మారుమూ ల గ్రామాల్లో వౌలిక సదుపాయాల ను మెరుగుపర్చడం జరిగిందని, ప్రతి ఊరుకు మెరుగైన రోడ్డు సౌకర్యం క ల్పించడం జరిగిందన్నారు. వ్యవసా యరంగాన్ని లాభసాటిగా మార్చడ మే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ వంటి చారిత్రాత్మక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందనీ, ఈ పథకా లు రైతుల కుటుంబాల్లో వెలుగులు ని ంపాయన్నారు. వృద్దులు, వికలాంగు లు, వితంతువులకు అండగా నిలిచేందుకు ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, మరోసారి టీఆర్‌ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన వెం టనే ఆసరా పింఛన్లను పెంచడంతో పాటు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ఇంటిస్థలాలు ఉన్నచో టే డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. మహాకూటమి మాట లు నమ్మి ప్రజలు మోసపోవద్దని, అధికార కాంక్షతో ప్రజల్లోకి వస్తున్న కాం గ్రెస్, బిజెపి నాయకులకు టీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్దిచూపి నిలదీయాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బిజెపి పాలిత ప్రాంతాల్లో అమలు కావడం లేదని, ఈ విషయం ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందన్నారు. మరోసారి కా రు గుర్తుకు ఓటువేసి గెలిపించినట్లయితే ఆదిలాబాద్‌ను మరింత అభివృద్దిపరుస్తానని హామీ ఇచ్చారు.
ఆయా గ్రామాల్లో మంత్రి రామన్న సమక్షంలో యువకులు, నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబి కండువాలు కప్పుతూ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణంలోని 28వ వార్డు డాల్డా కంపెనీ కాలనీలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు డెయిరీ కార్పోరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె రాజన్న, టీఆర్‌ఎస్ నాయకులు మంచికట్ల ఆశమ్మతోపాటు సిరాజ్‌ఖాద్రీ, సాజిదొద్దిన్, పవన్‌రావు, బండారి సతీష్, జిలాని, సురేఖ, పర్వీన్, అంజలి తదితరులు పాల్గొన్నారు.