అదిలాబాద్

దేశ రాజకీయాల్లో తెలంగాణ మోడల్‌గా నిలిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, నవంబర్ 16: భారతదేశ రాజకీయాలలో తెలంగాణ మోడల్‌గా నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలోని జలాలు పెట్రోల్‌బంక్ సమీపంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమ న్ ఆశీర్వాద సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశ చరిత్రలోనే 24 గంటల కరెంట్ సరఫరా చేసిన ఘనత టి ఆర్ ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని ఓర్వలేకే దొంగలంతా ఒక్కటై ముఠా కట్టి మహా కూటమిని ఏర్పాటు చేశారని అన్నారు. ఈ దొంగల ముఠాను నమ్మి ప్రజలు మోస పోవద్దన్నారు. ప్రొఫేసర్ కోదండరాం టిజేఎస్‌ను ఏర్పాటుచేసి 119 సీట్లలో పోటీ చేస్తానని చెప్పి 1, 2 సీట్లు అడుక్కనే గతి పట్టిందని ఎద్దెవా చేశారు. తెలంగాణ అభివృద్దికి అడుగడుగునా అడ్డుపడ్డ చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు.