అదిలాబాద్

ఐదో రోజు ఆరు నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, నవంబర్ 16: శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై ఐదవ రోజుకు చేరుకోగా శుక్రవారం ఖానాపూర్ శాసన సభ నియోజకవర్గానికి ఆరు నామినేషన్లు ఆయా పార్టీల అభ్యర్థులు సమర్పించా రు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాథోడ్ రమేష్ తరపున ఆయన సతీమణి రాథోడ్ సుమన్‌బాయి నామినేషన్ పత్రాలు సమర్పించగా బిజెపి అభ్యర్థి సట్ల అశోక్, సిపిఐఎం అభ్యర్థి తొడసం భీంరావు, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రేఖానాయక్ తరపున ఆ పార్టీ నాయకులు, స్వతంత్ర అభ్యర్థిగా నేతావత్ రాజెందర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాథోడ్ రితేష్ సైతం నామినేషన్లను ఖానాపూర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్‌కు అందజేశారు. ఆయా అభ్యర్థులు నామినేషన్ల అనంతరం విజయం తమదేనంటూ తోటి కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో బహుజన్ లెప్ట్ ఫ్రంట్ నాయకులు దండారి రవికుమార్, లంక రాఘవులు, పోతు శంకర్, రాజన్న, నేతావత్ రాందాస్ పాల్గొన్నారు.
రెబెల్ అభ్యర్థిగా మాజీ మంత్రి వినోద్
భీమిని, నవంబర్ 16: తెరాస పార్టీలో ముఖ్యనేతగా కొనసాగిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కార్మిక మంత్రిగా పనిచేసిన గడ్డం వినోద్ తెరాస పార్టీ నుండి చెన్నూర్ నియోజక వర్గంలో పోటీలో ఉండటానికి టికేట్ ఆశించి భంగ పడ్డారు. భీమిని, కనె్నపల్లి మండలాలతోపాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన కార్యకర్తలు హైదరాబాద్‌కు వెళ్లి రెబల్ అభ్యర్థిగా పోటీలో నిలవాలని మద్దతు ఇవ్వడ ంతో శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని ఓ కౌన్సిలర్ ఇంట్లో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి భీమిని, కనె్నపల్లి మండలాలకు చెందిన తెరాస, కాం గ్రెస్ నాయకులు మాజీ పిఏసిఎస్ చైర్మన్ సంఘర్స్ రవీందర్‌రావు, మాజీ సర్పంచ్ బండి అశోక్‌గౌడ్, జన్కాపూర్ గ్రామానికి చెందిన ఎంపిటిసి నర్సింగరావు, కనె్నపల్లికి చెందిన మాజీ సర్పంచ్ పూల్లూరి రాజయ్య, కాంగ్రెస్ నాయకులు వెంకన్న, తమ అనుచరులతో సమావేశానికి వెళ్లి వినోద్‌కు మద్దతు ప్రకటించారు. బరిలో నిలవాలని గెలిపించడానికి కృషిచేస్తామని సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి మాట్లాడుతూ టికేట్ వస్తుందని ఆశించినప్పటికీ తెరాస పార్టీ టికేట్ కేటియించ కపోవడంతో కార్యకర్తల అభిష్టం మేరకు బరిలో నిలవడానికి నిర్ణయించుకున్నానని ఈనెల 19న ముఖ్య నాయకులతో కలిసి నామినేషన్ సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సరిహద్దులో కదలికలపై ప్రత్యేక నిఘా
కౌటాల, నవంబర్ 16: కౌటాల సర్కిల్ పరిధిలోని సరిహద్దులో ఉన్న ప్రాణహిత, పెనుగంగా నదీ తీరాలలో అనుమానిత వ్యక్తుల కదలికలపై మావోయిస్టుల సంచారంపై ప్రత్యేక నిఘా నిలుపుతున్నామని, కౌటాల సిఐడి మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సరిహద్దులోని గ్రామాలు వాటికి అనుకొని ఉన్న ప్రాంతాలు ఎటువంటి అనుమానిత వ్యక్తులు కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఇప్పటికే ఈవిషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయా పోలీస్‌స్టేషన్‌ల ఎస్సైలద్వారా అవగాహన క ల్పించామని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు తమవంతు సహాకారాన్ని అందించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేవిధంగా పోలీస్‌శాఖ తరుపున పటిష్టచర్యలు తీసుకుంటున్నామని సిఐ పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించి అనుమతి లేకుండా చేపట్టే ఎటువ ంటి కార్యకలాపాలు అయిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎవరు ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలు చేపట్టవద్దన్నారు.