అదిలాబాద్

బెల్లంపల్లి నుండి బరిలో ఉంటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, నవంబర్ 16: బెల్లంపల్లి నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉంటానని మాజీ మంత్రి గడ్డ ం వినోద్ స్పష్టం చేశారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ చైర్‌పర్సన్ మునిమంద స్వరూప రమేష్‌ల నివాసంలో ఆయన విలేకరులతో సమావేశమయ్యారు. వినోద్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజక వర్గ ప్రజలకు కాక వెంకటస్వామి అనే క సేవలందించారని తెలిపారు. 1957 నుండి కాక వెంకటస్వామి కేంద్ర మం త్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసి పేద బ డుగు, బలహీనవర్గాల ప్రజలకు అనేక సేవలు చేశారని ఆయన తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత నాలుగు దశాబ్దాలుగా పేద ప్రజలకు అనేక సే వ కార్యక్రమాలు చేపడుతున్నామని తె లిపారు. బెల్లంపల్లి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని, తన అభిమానులు, కార్యకర్తలు ప్రాధే యపడుతున్నారని వారి అభిమానం కొరకు తాను బెల్లంపల్లి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈనెల 19న నామినేషన్‌లు దాఖలు చేయనున్నట్లు ఆయన స పష్టం చేశారు. తన అన్న వివేక్ ఈ ప్రా ంత ప్రజలందరికి సుపరిచితుడని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయా ంలో గొల్ల వాగు ప్రాజెక్ట్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డ్రింకింగ్ వాటర్, అనేక కార్యక్రమాలను చేపట్టామని తెలిపా రు. తనకు అన్నివిధాల ఒత్తిడిలు వస్తున్నాయని, తన కార్యకర్తల, అభిమాను ల అభిష్టం మేరకు తాను బరిలో ఉం టున్నానని ఆయన తెలిపారు. బెల్లంప ల్లి ఎమ్మెల్యేగా గెలిచినతరువాత తాను బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. వీగాం ఎంపిటిసి దుర్గం ప్రభాకర్ మా ట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నరేళ్ల కాలంలో ఎమ్మెల్యేగా పనిచేసిన దుర్గం చిన్నయ్య ఎ లాంటి అభివృద్ది చేయలేదని అవినీతి అక్రమాలు భూకబ్జాలకు పాల్పడ్డారని విమర్శించారు. మండల అభివృద్దికి ని ధులు కేటాయించాలని దుర్గం చిన్నయ్యను వేడుకోగా బ్లేడ్, కత్తి పట్టుకొ ని ఒడ్డుమీద కూర్చుంటే డబ్బులు వ స్తాయని మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అవినీతి అక్రమాల కు భూకబ్జాలకు పాల్పడిన ఇలాంటి అవినీతి చిన్నయ్యను గెలిపిస్తే బెల్లంపల్లి నియోజకవర్గం భ్రస్టు పడుతుందని మండిపడ్డారు. ఈ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ మంత్రి గడ్డం వినోద్‌ను గెలిపి స్తే బెల్లంపల్లి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ది చెందుతుందని తెలిపారు.
సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ మునిమంద స్వరూప, వేమన పల్లి జడ్పిటిసి రుద్రపట్ల సంతోష్‌కుమార్, మాజీ అప్‌కో చైర్మన్ గడ్డం జగన్నాథం, జన్కాపూర్ ఎంపిటిసి నర్సిం గరావు, వేమనపల్లి ఎంపిపి కుర్రు వెం కటేశం, పిఏసిఎస్ మాజీ చైర్మన్ ఎస్ రవీందర్‌రావు, మాజీ సర్పంచ్ బండి అశోక్‌గౌడ్, భీమిని టిఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షులు మామిడిపల్లి శ్రీహారీ రావు, మున్సిపల్ కౌన్సిలర్‌లు తదితర నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు

కాగజ్‌నగర్ రూరల్, నవంబర్ 16: డిసెంబర్ 7న జరుగనున్న ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగే లా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నా రు. శుక్రవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌ స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నిక లదృష్ట్యా ఎక్కడ ఎలాంటి ఆవాంఛనీ య సంఘటనలు చోటుచేసుకోకుం డా ఉండేందుకు నాకాబందీలు ఏర్పా టు చేసినట్లు స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌లు ఎన్నికల సెల్ ఇంచార్జ్‌లు ఎప్పటికప్పుడు తమ పరిధిలో జరిగే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారుల కు తెలపాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో ముందస్తుగానే పోలీసు లు గట్టి బందోబస్తు ఏర్పాటుచేసి ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మీటర్ల దూరంలో వివిధ పార్టీలకు సంబంధి ంచిన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలని సూచించారు. ఆయన వె ంట స్పెషల్‌బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఆశయ య, డిఎస్పీ సాంబయ్య, ఎలక్షన్ సెల్ ఇంచార్జ్ రామారావు, పట్టణ ఎస్‌హెచ్ ఓ వెంకటేశ్వర్, రూరల్ సిఐ వెంకటేష్, కౌటాల సిఐ మోహన్, ఎస్సైలు, పోలీస్‌సిబ్బంది ఉన్నారు.