అదిలాబాద్

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, నవంబర్ 16: శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలిగించడంతోపాటు నిగూఢకృతమై ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని, చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సం దర్భంగా శుక్రవారం స్ధానిక ఎన్టీఆర్ మినీస్టేడియంలో మహిళా, శిశు, ది వ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమశా ఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలను జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు స్నేహభావం, మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలిగిస్తాయని తెలిపారు. క్రీడాకారులు భారీ సంఖ్యలో క్రీడల్లో పాల్గొని తమనైపుణ్యాలను పె ంపొందించుకోవాలన్నారు. జిల్లాలోని జనాభాలో 4 శాతం మంది దివ్యాంగులున్నారన్నారు. జిల్లాలో 13 వేలకు పైగా దివ్యాంగులు ఓటుహక్కుకు అ ర్హులుగా ఉన్నారని, ప్రస్తుతం 9258 మంది మాత్రమే ఓటర్ల జాబితాలో పే రు నమోదు చేసుకున్నారని, మిగతా వారంత ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేలా వికలాంగుల సంక్షేమ సంఘం కృషిచేయాలన్నారు. శాసనసభ సాధారణ ఎన్నికల్లో దివ్యాంగుల కు పోలింగ్ కేంద్రాల్లో తగిన సౌకరా యలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పిడబ్లు డి ఓటర్లకు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓ టు వేసేందుకు రవాణా సౌకర్యం కలి పంచనున్నట్లు, పోలింగ్ కేంద్రాల్లో రా యంపులు, వీల్‌చైర్లు, సైన్ లాంగ్వేజ్ ఏ ర్పాటుచేయడం జరిగిందన్నారు. బ్రే యిలీ లిపి ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాకు 450 వీల్ చైర్లు అవసరం కాగా వంద నిల్వ ఉన్నాయని, 50 ఎలక్షన్ కమీషన్ అం దిస్తుందని, 300 కొనుగోలుచేయనున్నట్లు తెలిపారు. ప్రతీఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు క్యూలో నిల్చోకుండా వారికోస ం షామియాన్, కుర్చీలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. వీరికోసం పోలి ంగ్ కేంద్రాల్లో ఐసీడీఎస్ ఆయాను వా లంటీర్‌గా పెడుతున్నట్లు తెలిపారు. అంధులను ఓటింగ్ కేంద్రాలకు తీసుకవెళ్లేందుకు ఒక తోడును అనుమతిస్తున్నట్లు తెలిపారు. జిల్లా మహిళా, శి శు, దివ్యాంగుల సంక్షేమ అధికారి మాట్లాడుతూ దివ్యాంగులకు పరుగు పందెం, ట్రైసైకిల్ క్యారమ్స్, చెస్, షా ట్‌ఫుట్, జావెలిన్‌త్రో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జి ల్లా విద్యాధికారి టి.ప్రణీత, డీపీ ఆ ర్‌వో అబ్దుల్ కలీం, దివ్యాంగుల సం క్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సట్టిసాయన్న, జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నారాగౌడ్, ఎండి.రియాజ్, ఫిజికల్ డైరెక్టర్లు, పీ ఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.