అదిలాబాద్

అభివృద్ధికి పట్టం కట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, నవంబర్ 18: గత నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయా ంలో చేపట్టిన అభివృద్దిని చూసి మరోసారి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అభ్యర్థించారు. ఆదివారం పట్టణంలోని ఈద్ గాం, ఆదర్శనగర్, శివాజీనగర్, సిద్దాపూర్, పోఫీనగర్, తదితర కాలనీల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు. ఆయా కాలనీల ప్రజలు మ ంత్రికి ఘనంగా స్వాగతం పలుకుతూ తమ ఓటు మీకేనంటూ ఆయన వెంట నడిచారు. ఇప్పటికే నిర్మల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ది చేశానని, నిర్మల్ పట్టణాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దుతానని హామీనిచ్చా రు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో ఏర్పాటుచేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజల అ భివృద్ది కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. అభివృద్ది, సం క్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ప్రతిపక్ష పా ర్టీల మాటలు నమ్మి మోసపోవద్దనా నరు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాల ని కోరారు. కార్యక్రమంలో నిర్మల్ ని యోజకవర్గ పార్టీ ఇంచార్జి దాదన్నగా రి విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులు ఎర్రవో తు రాజేంధర్, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, ముత్యంరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు రాజేంధర్, ఉస్మాన్ తదితరులు పా ల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని బుధవార్‌పేట్‌కు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు మార్గొండ రాము, డి.శ్రీనివాస్‌ల ఆద్వర్యంలో దాదాపు 100 మంది యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీని వీడి టీ ఆర్ ఎస్‌లో చేరారు. వీరికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీ కండువావేసి ఆహ్వానించారు. అలాగే నిర్మల్ మండలంలోని నీలాయిపేట్ గ్రామానికి చెందిన 50 మంది శ్రీ్భగత్‌సింగ్ యువజన సంఘం సభ్యులు, రాంరావుబాగ్ ఆంజనేయదేవాలయ కమిటి సభ్యులు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి మద్దతు పలికారు. టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతీఒక్కరు కృషిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.